ఒక మార్పుతో కింగ్స్‌ పంజాబ్‌ బరిలోకి..

1 Oct, 2020 19:07 IST|Sakshi

అబుదాబి:  ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ కింగ్స్‌ పంజాబ్‌ టాస్‌ గెలిచి ఫీల్దింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. ముందుగా ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఇరుజట్లు తలో మూడు మ్యాచ్‌లు ఆడగా ఒకదాంట్లో మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించాయి. ఆర్సీబీపై కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించగా, కేకేఆర్‌పై ముంబై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంటుంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండటంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌  ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గౌతమ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. లెగ్‌ స్పిన్నర్‌ స్థానంలో మురుగన్‌ అశ్విన్‌ స్థానంలో ఆఫ్‌ స్పిన్నర్‌ గౌతమ్‌ను తీసుకున్నారు. ఇక ముంబై ఇండియన్స్‌ గత మ్యాచ్‌ ఆడిన జట్టుతోనే పోరుకు సిద్ధమైంది.

ముంబై 13.. పంజాబ్‌ 11
ఇరు జట్ల మధ్య ఇప‍్పటివరకూ 24 మ్యాచ్‌లు జరగ్గా అందులో ముంబైదే పైచేయిగా ఉంది. ముంబై 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కింగ్స్‌ పంజాబ్‌ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ముంబైకు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యాలే ప్రధాన బ్యాటింగ్‌ బలంగా కాగా, కింగ్స్‌కు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, మ్యాక్స్‌వెల్‌, పూరన్‌లే కీలకం.  ఇక కింగ్స్‌ బౌలింగ్‌లో షమీ, కాట్రెల్‌, నీషమ్‌, రవిబిష్నోయ్‌లు ప్రధాన వనరులు కాగా, ముంబై ఇండియన్స్‌కు ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా, పాటిన్‌సన్‌, రాహుల్‌ చాహర్‌లు కీలకం కానున్నారు.

బుమ్రా వర్సెస్‌ మయాంక్‌
ఈ మ్యాచ్‌లో బుమ్రా-మయాంక్‌ మధ్య ఆసక్తికర పోరు సాగే అవకాశం ఉంది. ఇప్పటివరకూ మయాంక్‌ ఒక సెంచరీ సాయంతో 221 పరుగులు సాధించాడు. అతని స్టైక్‌రేట్‌ 170.00 గా ఉంది. ఇందులో ఒక హాఫ్‌ సెంచరీ కూడా ఉంది. ఈ సీజన్‌లో 21 ఫోర్లు, 11 సిక్స్‌లను మయాంక్‌ కొట్టాడు. దాంతో బుమ్రాను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఈ ఐపీఎల్‌లో బుమ్రా మూడు వికెట్లు మాత్రమే సాధించినా పరిస్థితులు ఏమాత్రం కలిసొచ్చినా విశ్వరూపం ప‍్రదర్శిస్తాడు. ఓవరాల్‌గా 80 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 85 వికెట్లు సాధించాడు. అతని ఎకానమీ 7. 64గా ఉంది.

ముంబై ఇండియన్స్‌
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్యా, జేమ్స్‌ పాటిన్‌సన్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా

కింగ్స్‌ పంజాబ్‌
కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, కరుణ్‌ నాయర్‌, నీషమ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, గౌతమ్‌, మహ్మద్‌ షమీ, షెల్డాన్‌ కాట్రెల్‌, రవి బిష్నోయ్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు