అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్‌.. వీడియో వైరల్‌ | KL Rahul And Athiya Shetty Attended Ganapathi Pooja At Ambani House, Trending On Social Media - Sakshi
Sakshi News home page

KL Rahul And Athiya Shetty Pics: అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్‌.. వీడియో వైరల్‌

Published Wed, Sep 20 2023 1:33 PM

KL Rahul Athiya Shetty Attended Ganapathi Pooja At Ambani House Video Viral - Sakshi

KL Rahul Posts An Adorable Pic With His Wife Athiya Shetty: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. గాయం కారణంగా నెలల తరబడి జట్టు దూరమైన ఈ కర్ణాటక ప్లేయర్‌.. ఆసియా కప్‌-2023తో ఘనంగా పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. అయితే, పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో మెగా ఈవెంట్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఈ క్రమంలో పాకిస్తాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన రాహుల్‌.. అజేయ సెంచరీ(111)తో సత్తా చాటాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. 

బ్యాట్‌తోనే కాదు  వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతోనూ ఆకట్టుకుని.. వన్డే వరల్డ్‌కప్‌-2023కి తాను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు చాటిచెప్పాడు ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌. ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ కంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఏకంగా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

సారథి రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ గైర్హాజరీ నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్‌ నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబరు 22న ఈ సిరీస్‌ మొదలు కానుండగా.. ఈ మధ్యలో దొరికిన కాస్త విరామ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.

భార్య అతియా శెట్టితో కలిసి.. భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ ఇంట గణపతి పూజలో పాల్గొన్నాడు. వైట్‌కుర్తా.. పైజామా ధరించి రాహుల్‌ హుందాగా కనిపించగా.. ఎరుపు రంగు చీరలో సంప్రదాయకట్టులో అతియా మెరిసిపోయింది. ఈ క్రమంలో రాహుల్‌- అతియా తమ అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

హార్ట్‌ ఎమోజీతో ఇన్‌స్టాలో ఇద్దరూ బుధవారం ఫొటోలను షేర్‌ చేయగా... నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక పూజలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ దంపతుల వీడియో సైతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునిల్‌ శెట్టి కుమార్తె, నటి అతియాతో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కేఎల్‌ రాహుల్‌.. ఈ ఏడాది జనవరిలో ఆమెతో కలిసి ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే.

చదవండి: ఆసియా కప్ ఫైనల్‌లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్‌ ఎవరంటే? 

Advertisement
Advertisement