Matthew Hayden Explain Reason Why Australia Failed To-Qualify Semi-Final - Sakshi
Sakshi News home page

T20 WC 2022: 'వెళ్లిపోయాకా ఈ మాట చెప్పడం ఎందుకు?'.. హెడెన్‌కు చురకలు

Published Tue, Nov 8 2022 5:14 PM

Matthew Hayden Explain Reason Why Australia Failed To-Qualify Semi-final - Sakshi

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ ప్రస్తుతం పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాను మెంటార్‌గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్‌ జట్టు టి20 ప్రపంచకప్‌లో ఆఖరి నిమిషంలో వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టి సెమీస్‌లో అడుగుపెట్టింది. నవంబర్‌ 9న(బుధవారం) న్యూజిలాండ్‌తో పాక్‌ అమితుమీ తేల్చుకోనుంది. ఇక మాథ్యూ హెడెన్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఈ ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా సూపర్‌-12 దశలోనే వెనుదిరగడంపై స్పందించాడు.

''ఈ ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లుగా అనిపించలేదు. జరుగుతున్నది ఒక ప్రీమియమ్‌ ఈవెంట్‌. ప్రీమియమ్‌ ఈవెంట్‌ అంటే ఎలా ఉండాలి.. అన్ని శక్తులు సిద్ధం చేసుకొని బరిలోకి దిగాలి. కానీ దురదృష్టవశాత్తూ ఆసీస్‌ జట్టు ఎలాంటి ప్లానింగ్‌ లేకుండానే ప్రపంచకప్‌లో ఆడింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదా దశలో అడుగుపెట్టిన ఆసీస్‌ ఇవాళ సూపర్‌-12లోనే నిష్క్రమించడం కాస్త బాధ కలిగించింది.

గత నాలుగైదేళ్లుగా ఆస్ట్రేలియా క్రికెట్‌ను అందరం గమనిస్తూ వస్తున్నాం. కొన్ని డిపార్ట్‌మెంట్లలో మార్పు అవసరం.. ముఖ్యంగా ఫాస్ట్‌ బౌలింగ్‌లో మునుపటి పేస్‌ను చూడలేకపోతున్నాం. కీలకమైన మ్యాచ్‌కు మిచెల్‌ స్టార్క్‌ దూరమవడం జట్టు లయను దెబ్బతీసింది. అలాగే డేవిడ్‌ వార్నర్‌ ప్రదర్శన చూసుకుంటే గత వరల్డ్‌కప్‌కు ఈసారి పొంతన లేనట్లుగా ఉంది. అతనొక ప్రీమియమ్‌ ప్లేయర్‌. కానీ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. అతనే కాదు మిగతా ఆసీస్‌ ఆటగాళ్ల పరిస్థితి కూడా ఇదే.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

అయితే హెడెన్‌ వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానులు ఘాటుగా స్పందించారు. ''నువ్వు ప్రస్తుతం పాక్‌ జట్టుకు మెంటార్‌గా ఉన్నావు. ముందు మీ జట్టులోని లోపాలను సరిదిద్దుకుంటే మంచింది. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి వెళ్లిపోయాకా ఇప్పుడు మాట్లాడడం ఏంటి'' అని కామెంట్‌ చేశారు.

చదవండి: టీమిండియాతో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు మరో బిగ్‌ షాక్‌..!

Kane Williamson: కెప్టెన్‌గా హీరో.. కప్పు అందుకోవడంలో జీరో; ఈసారైనా

Advertisement
Advertisement