Matthew Wade Produces Stunning Six Saving Effort The Hundred 2023 Viral - Sakshi
Sakshi News home page

Matthew Wade: కళ్లు చెదిరే ఫీల్డింగ్‌.. 35 ఏళ్ల వయసులో విన్యాసాలేంటి బ్రో?

Published Thu, Aug 3 2023 4:32 PM

Matthew Wade Produces Stunning Six-Saving Effort-The Hundred 2023-Viral - Sakshi

క్రికెట్‌లో 35 ఏళ్లు దాటాయంటే సదరు ఆటగాళ్లు రిటైర్మెంట్‌కు దగ్గరైనట్లే. ఈ వయసులో ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ జట్టులో కొనసాగడమే ఒక్కోసారి కష్టంగా మారుతుంటుంది. అలాంటిది ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ వేడ్‌ 35 ఏళ్ల వయసులోనూ తన ఫీల్డింగ్‌ విన్యాసాలతో అభిమానులను అబ్బురపరుస్తున్నాడు. ప్రస్తుతం వేడ్‌ హండ్రెడ్‌ మెన్స్‌ కాంపిటీషన్‌ టోర్నీలో లండన్‌ స్పిరిట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బుధవారం లండన్‌ స్పిరిట్‌, ఓవల్‌ ఇన్విజబుల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.

ఈ మ్యాచ్‌లో వేడ్‌ సూపర్‌ ఫీల్డింగ్‌తో మెరిశాడు. ఓవల్‌ ఇన్విజబుల్స్‌ ఇన్నింగ్స్‌ 94వ బంతికి ఇది చోటుచేసుకుంది. జోర్డాన్‌ థాంప్సన్‌ వేసిన బంతిని గస్‌ అత్కిన్‌సన్‌ డీప్‌స్వ్కేర్‌ లెగ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. అయితే అక్కడే ఉన్న మాథ్యూ వేడ్‌ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని పట్టుకొని బౌండరీ ఇవతలకు విసిరేశాడు. ఒకవేళ వేడ్‌ పట్టుతప్పి ఉంటే కచ్చితంగా సిక్స్‌ వచ్చేదే. కానీ వేడ్‌ ఫీల్డింగ్‌ పుణ్యానా కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. వేడ్‌ అద్బుత విన్యాసానికి స్టాండ్స్‌లోని ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఓవల్‌ ఇన్విజబుల్స్‌ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన లండన్‌ స్పిరిట్‌ వంద బంతుల్లో 131 పరుగులు చేసింది. అనంతరం ఓవల్‌ ఇన్విజబుల్స్‌ 99 బంతుల్లో విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో చివర్లో 5 బంతుల్లో 13 పరుగులు చేసి జట్టును గెలిపించిన నరైన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: WI Vs IND 1st T20: తొలి టి20.. భారత్‌ ముంగిట అరుదైన రికార్డు; పాక్‌ మనకంటే ముందే?

Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్‌ అయ్యాడో కానీ అంతా శుభమే..

Advertisement

తప్పక చదవండి

Advertisement