RCB Vs MI: ఇదేమి బౌలింగ్‌ రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్‌ ఆడుకోండి! ఆర్సీబీపై ట్రోలింగ్‌ | IPL 2024 RCB Vs MI: Maxwell, Siraj And Topley Join Forces In A Disastrous Show By RCB - Sakshi
Sakshi News home page

Trolls On RCB Bowlers: ఇదేమి బౌలింగ్‌ రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్‌ ఆడుకోండి! ఆర్సీబీపై ట్రోలింగ్‌

Published Fri, Apr 12 2024 6:00 AM

Maxwell, Siraj and Topley Join Forces In A Disastrous Show By RCB - Sakshi

ఐపీఎల్‌-2024లో ఆర్సీబీ మరో ఘోర ఓటమి చూవిచూసింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. గల్లీ బౌలర్లు కంటే దారుణంగా బౌలింగ్‌ చేసిన ఆర్సీబీ బౌలర్లు.. మ్యాచ్‌ను ముంబైకు సమర్పించుకున్నారు.

ఆర్సీబీ చెత్త బౌలింగ్‌ కారణంగా ముంబై 197 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఊదిపడేసింది. ముంబై బ్యాటర్లు ఇషాన్‌ కిషన్‌(69),సూర్యకుమార్‌ యాదవ్‌(52) బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు.కనీసం ముంబై బ్యాటర్లు అడ్డుకోవడానికి ఏ ఒక్క బౌలర్‌ కూడా ప్రయత్నించలేదు. సిరాజ్‌, టాప్లీ లాంటి అంతర్జాతీయ స్ధాయి బౌలర్లు సైతం చేతులెత్తేశారు.

సిరాజ్‌ 3 ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకోగా.. టాప్లీ కూడా 3 ఓవర్లలో 34 పరుగులిచ్చాడు. ఇక జూనియర్‌ బౌలర్ల విషయానికి వస్తే.. ఆకాష్‌ దీప్‌ అయితే బౌలింగ్‌లో ఏకంగా హాఫ్‌ సెంచరీ కొట్టేశాడు. 3.3 ఓవర్లలో ఆకాష్‌ ఏకంగా 55 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు. అటు విజయ్‌కుమార్‌ వైశ్యాఖ్‌ సైతం భారీ పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా మరోసారి ఆర్సీబీ ఓటమిలో బౌలర్లు  కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్లను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మీకెందుకు ఆట దండగా.. వెళ్లి గల్లీ క్రికెట్‌ ఆడుకోండి అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు.

Advertisement
Advertisement