సిక్సర్ల వర్షం కురిపించిన ధోని.. వీడియో వైరల్ | Sakshi
Sakshi News home page

IPL 2024: సిక్సర్ల వర్షం కురిపించిన ధోని.. వీడియో వైరల్

Published Sun, Mar 10 2024 7:19 AM

MS Dhoni hits mammoth sixes in the nets ahead of IPL 2024 - Sakshi

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2024 సీజన్‌కు సమయం అసన్నమైంది. మరో 12 రోజుల్లో ఈ ధానాధన్‌ లీగ్‌కు తెరలేవనుంది. మార్చి 22న చెపాక్‌ వేదికగా తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

ధోని సిద్దం..
ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సన్నద్దమవుతున్నాడు. చెపాక్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్‌ శిబరంలో ధోని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మిస్టర్‌ కూల్‌ ఎక్కువగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నెట్స్‌లో ధోని భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్‌కే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తలా ఈజ్‌ బ్యాక్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నాల్గవ ఆటగాడిగా..
కాగా ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన నాలుగో ఆటగాడిగా ధోని కొనసాగుతున్నాడు. ధోని ఇప్పటివరకు ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 239 సిక్స్‌లు బాదాడు. అయితే అత్యధిక సిక్స్‌ల కొట్టిన కెప్టెన్‌గా మాత్రం ధోనినే ఉన్నాడు.
చదవండి: IND vs ENG: రిటైర్మెంట్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement