‘రోహిత్‌ బ్యాటర్‌గా రాణించాలని కెప్టెన్సీ తప్పించాం’ | Sakshi
Sakshi News home page

‘రోహిత్‌ బ్యాటర్‌గా రాణించాలని కెప్టెన్సీ తప్పించాం’

Published Wed, Feb 7 2024 3:54 AM

Mumbai Indians Head Coach Mark Boucher about Rohit sharma  - Sakshi

ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ యథేచ్ఛగా పరుగులు చేయాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ వివరించాడు. ‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. కానీ జట్టు కోసం తప్పలేదు.

రోహిత్‌ గత రెండు సీజన్లుగా జట్టును సమర్థంగా నడిపించాడు. ఇందులో సందేహం లేదు. కానీ పరుగులు చేయడంలో వెనుకబడ్డాడు. ఇప్పుడు అతను ఏ ఒత్తిడి లేకుండా తనకిష్టమైన ఓపెనింగ్‌ పాత్రలో మెరిపించేందుకు మా నిర్ణయం దోహదం చేస్తుంది’ అని బౌచర్‌ అన్నాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement