టీ20 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన కివీస్‌.. ఇద్దరు సీనియర్లు ఔట్‌

10 Aug, 2021 10:07 IST|Sakshi

New Zealand ICC T20 World Cup 2021 Team: యూఏఈ వేదికగా అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. జట్టుకు కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌ను ఎంపిక చేయగా, సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌, వెటరన్‌ ఆల్‌ రౌండర్‌ కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌లను తప్పించింది. ఇంజ్యూరీ కవర్‌గా అడమ్‌ మిల్నేను ఎంపిక చేసింది.

ఇదిలా ఉంటే, గడిచిన రెండు మూడేళ్లుగా కేన్‌ సారధ్యంలో న్యూజిలాండ్‌ జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతుంది. భారత్‌తో స్వదేశంలో సిరీస్‌(5-0) దగ్గరి నుండి ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోకుండా పొట్టి ఫార్మాట్‌లో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దీంతో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్‌ జట్టు హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.  

న్యూజిలాండ్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), టాడ్‌ ఆస్టల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, మార్క్‌ చాప్‌మన్‌, డేవాన్‌ కాన్వే, ఫెర్గూసన్‌, మార్టిన్‌ గప్టిల్‌, కైల్‌ జేమీసన్‌, డారిల్‌ మిచెల్‌, జిమ్మీ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్‌, మిచెల్‌ సాట్నర్‌, టిమ్‌ సీఫెర్ట్‌(వికెట్‌ కీపర్‌), ఐష్‌ సోధి, టిమ్‌ సౌథీ, అడమ్‌ మిల్నే(ఇంజ్యూరీ కవర్‌)

మరిన్ని వార్తలు