WI Vs IND 2nd T20I: Nicholas Pooran Has Now Smashed The Most T20I Runs Against India - Sakshi
Sakshi News home page

IND vs WI: నికోలస్‌ పూరన్‌ ఊచకోత.. టీమిండియాపై సరికొత్త చరిత్ర! ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా

Published Mon, Aug 7 2023 12:27 PM

Nicholas Pooran has now smashed the most T20I runs  against India. - Sakshi

టీమిండియాతో టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గయానా వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన విండీస్‌.. 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు ఆటగాడు నికోలస్‌ పూరన్‌ కీలక పాత్ర పోషించాడు. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ తొలి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పూరన్‌ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలు వర్షం కురిపించాడు. ముఖ్యంగా 6వ ఓవర్‌ వేసిన రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో ఏకంగా 18 పరుగులు రాబాట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 40 బంతులు ఎదుర్కొన్న పూరన్‌.. 4 సిక్స్‌లు, 6 ఫోర్లు సాయంతో 67 పరుగులు చేశాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన పూరన్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

పూరన్‌ సాధించిన రికార్డులు ఇవే..
►టీమిండియాపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్‌ నిలిచాడు. ఇప్పటివరకు భారత్‌పై 524 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌(500) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఫింఛ్‌ రికార్డును పూరన్‌ బ్రేక్‌ చేశాడు.

►అదే విధంగా భారత్‌పై అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు సాధించిన మొదటి క్రికెటర్‌గా పూరన్‌ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు టీమిండియాపై 5 సార్లు 50 ప్లస్‌ స్కోర్లు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు జోస్‌బట్లర్‌, ​మున్రో, డికాక్‌ పేరిట ఉండేది. వీరిముగ్గురు  4 సార్లు 50 ప్లస్‌ స్కోర్లు సాధించారు.
చదవండి: World Cup 2023: ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్‌ ఆటగాడిపై వేటు! యువ ఆటగాళ్లు ఎంట్రీ

Advertisement

తప్పక చదవండి

Advertisement