'ఎర్త్‌ అవర్‌ ఇండియా' గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా పీవీ సింధు.. | Sakshi
Sakshi News home page

Earth Hour 2024: గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా పీవీ సింధు.. అస్సలు ఏంటి ఈ ఎర్త్‌ అవర్‌?

Published Tue, Mar 12 2024 6:03 PM

P V Sindhu named goodwill ambassador for 2024 Earth Hour India - Sakshi

గత 18 ఏళ్లగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగహన కల్పించేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) సంస్ధ 'ఎర్త్‌ అవర్‌' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో 2024కు గాను'ఎర్త్‌ అవర్‌ ఇండియా' గుడ్‌విల్‌ అంబాసిడర్‌ భారత బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధు ఎంపికైంది.

మార్చి7న అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టిన సింధు.. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై అవగహన కల్పించే పనిలో పడింది. తాజాగా సింధుతో పాటు ప్రముఖ మోడల్‌ దియా మీర్జా, హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్‌ సింగర్‌ రఘు దీక్షిత్ 'ఎర్త్‌ అవర్‌ ఇండియా' గుడ్‌విల్‌ అంబాసిడర్‌లగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా రఘు దీక్షిత్ మాట్లాడుతూ.. "డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎర్త్‌ అవర్‌  ఇండియా అంబాసిడర్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. పర్యవరాణాన్ని రక్షించేందుకు మనమందరం ఏకం కావల్సిన సమయం అసన్నమైంది. ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా అవహగహన కల్పించేందుకు నా వంతు కృషి చేస్తాను. సహజ వనరులు, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరది. కాబట్టి అందరూ గంట సమయం పాటు లైట్లను ఆపి ఈ కార్యక్రమంలో భాగమవుతరాని ఆశిస్తున్నానని" పేర్కొన్నాడు.

చాలా సంతోషంగా ఉంది..
"డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎర్త్‌ అవర్‌ ఇండియా గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది .ఈ ప్రాతిష్టత్మక ఈవెంట్‌లో భాగమయ్యే అవకాశం ఇచ్చినందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌కు ధన్యవాదాలు. ప్రతీ ఏడాది కూడా నేను ఈ ఎర్త్‌అవర్‌ కార్యక్రమంలో పాల్గోంటున్నాను. గతం కంటే ఈసారి ఎక్కువమం‍ది ఈ కార్యక్రమంలో భాగమవుతారని ఆశిస్తున్నాను. నా వరకు అయితే ఈ ఏడాది అన్ని లైట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఒక గంట పాటు ఆపివేసి, నా కుటుంబంతో కలిసి క్యాండిల్‌లైట్ డిన్నర్‌ చేస్తాను. 

పర్యావరణాన్ని, ఈ భూమిని కాపాడే బాధ్యత మనందరది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను వాడడం మానేయాలి.  పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఎంతో మేలు చేస్తోంది. ప్రతీ ఏడాది ఒక గంట మాత్రమే కాకుండా ప్రతీ రోజు కూడా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని" దీయా మీర్జా పేర్కొంది. దుల్కర్‌ సల్మాన్‌ సైతం ఎర్త్‌ అవర్‌ గుడ్‌విల్‌ అంబాసిండర్‌గా ఎంపికకావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.  తనతో పాటు అందరూ గంట సేపు లైట్లను ఆపి ఈ కార్యక్రమంలో భాగం కావాలని అభిమానులను దుల్కర్‌ కోరాడు.

అస్సలు ఏంటి ఈ ఎర్త్‌ అవర్‌?
కర్బన ఉద్గారాలను తగ్గించడం, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తొలిసారిగా ఈ ఎర్త్‌ అవర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు సుమారు 187 దేశాల్లోని ఏడువేల నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో గంట పాటు లైట్లను ఆర్పివేసి విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడమే ఈ కార్యక్రమం​ ఉద్దేశ్యం. ​కాగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 25వ తేదీ నాడు ఎర్త్ అవర్ ను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం రెండు రోజుల ముందే ఎర్త్‌ అవర్‌ కార్యక్రమాన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్  నిర్వహించనుంది. అంటే మార్చి 23న సాయంత్రం 8:30 గంటల నుంచి 9: 30 గంటల వరకు ఈ ఎర్త్‌ అవర్‌ కార్యక్రమం జరగనుంది.
 

Advertisement
Advertisement