ENG vs PAK: 17 ఏళ్ల తర్వాత పాక్‌ పర్యటనకు ఇంగ్లండ్‌.. షెడ్యూల్‌ విడుదల..!

2 Aug, 2022 18:40 IST|Sakshi

17 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్‌ జట్టు పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా పాక్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ తలపడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇరు జట్లు మధ్య టీ20 సిరీస్‌ సెప్టెంబర్‌ 20 నుంచి ఆక్టోబర్‌2 వరకు జరగనుంది. ఈ సిరీస్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లు  కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. అఖరి మూడు టీ20లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇక ఈ మ్యాచ్‌లు అన్నీ పాకిస్తాన్‌ కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌ ముందు ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అఖరి నిమిషంలో పాక్‌ పర్యటను  ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు రద్దు చేసింది.

ఇక  టీ20 ప్రపంచకప్‌-2021 ముగిసిన తర్వాత  ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు దుబాయ్‌లో సమావేశమయ్యారు. 2022 ఏడాది మధ్యలో ఇంగండ్‌ జట్టు పాక్‌లో పర్యటించి ఏడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు ఇరు బోర్డులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగానే ఇంగ్లండ్‌ జట్టు పాక్‌ గడ్డపై అడుగు పెట్టనుంది.
చదవండి: Asia Cup 2022 Schedule: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు