Accused Of Snubbing Post-Ashes Drink With Australian Players, Ben Stokes Issues Clarification - Sakshi
Sakshi News home page

Ben Stokes: 'తప్పుడు వార్తలు.. ఆసీస్‌ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు'

Published Tue, Aug 1 2023 4:32 PM

Post-Ashes Drink With Australian Players Ben Stokes Issue-Clarification - Sakshi

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్‌ సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌ గెలవడంతో ఇంగ్లండ్‌ కథ ముగిసేనట్లేనని అంతా భావించారు. కానీ మూడో టెస్టులో గెలిచిన ఇంగ్లండ్‌ 2-1తో ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో ఐదోటెస్టు ఇంగ్లండ్‌కు కీలకంగా మారింది.

చివరి టెస్టు గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని భావించిన ఇంగ్లండ్‌ అందుకు తగ్గట్లుగానే బజ్‌బాల్‌ ఆటతీరుతో ఆసీస్‌ను కట్టడి చేసింది. కానీ 384 పరుగుల టార్గెట్‌ను ఆసీస్‌ చేధించేలా కనిపించింది. కానీ ‍ఇంగ్లండ్‌ కొత్త బంతి తీసుకోవడంతో ఆట ఐదోరోజు తొలి సెషన్‌లో కథ మొత్తం మారిపోయింది. ఆసీస్‌ తొందరగా వికెట్లు కోల్పోవడంతో 49 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 

కాగా మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఆసీస్‌ ఆటగాళ్లు, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఒక దగ్గర చేరి డ్రెస్సింగ్‌రూమ్‌లోనే మందు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఖండించాడు. స్టోక్స్‌ మాట్లాడుతూ.. ''పార్జీ జరిగిన మాట నిజమే.. కానీ మీరు అనుకుంటున్నట్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు. నిజానికి మ్యాచ్‌ ముగిసిన తర్వాత కరచాలనం అనంతరం ఆసీస్‌ ఆటగాళ్లు మా దగ్గరకు వచ్చారు.

కానీ మా ప్రధాన ఆటగాళ్లు స్టువర్ట్‌ బ్రాడ్‌, మొయిన్‌ అలీ రిటైర్మెంట్‌పై స్పెషల్‌ స్పీచ్‌లతో చిన్న పార్టీ చేసుకున్నాం. ఈ నేపథ్యంలో ఆసీస్‌ ఆటగాళ్లు ఒక గంటపాటు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. మేం బిజీగా ఉండడంతో మమ్మల్ని కలవకుండానే ఆసీస్‌ ఆటగాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిజానికి యాషెస్‌ సిరీస్‌ ముగిశాక ఆసీస్‌ ఆటగాళ్లతో కలిసి సంప్రదాయ సెలబ్రేషన్స్‌ చేసుకోవాలి. కానీ బ్రాడ్‌, మొయిన్‌ అలీ రిటైర్మెంట్‌, ఇతర కార్యక్రమాల వల్ల కలవడం కుదరలేదు.

అయితే ఆసీస్‌ ఆటగాళ్లతో కలిసి నైట్‌క్లబ్‌కు వెళ్లి పార్టీ ఎంజాయ్‌ చేయాలని నిశ్చయించుకున్నాం. నెలరోజుల పాటు యాషెస్‌ ఆడాం. ఎన్ని గొడవలు జరిగినా అది మ్యాచ్‌ల వరకే పరిమితం. బయట ఆ విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించుకోం.. సరదాగా ఎంజాయ్‌ చేయడానికి చూస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్‌ ఓటమి.. విచారణ చేపట్టండి'

 ఉస్మాన్‌ ఖవాజా అరుదైన ఘనత! యాషెస్‌ చరిత్రలో 26 ఏళ్ల తర్వాత..

Advertisement
Advertisement