Sakshi News home page

IPL 2022- CSK: గొప్ప క్రికెటర్‌.. గొప్ప కెప్టెన్‌ అవుతాడన్న నమ్మకం లేదు.. కానీ

Published Fri, Mar 25 2022 3:25 PM

Rajkumar Sharma On Jadeja Sometimes Good Cricketer Is Not Necessarily Good Captain - Sakshi

ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్‌​కింగ్స్‌ జట్టులో చోటుచేసుకున్న మార్పు గురించి ఢిల్లీ రంజీ జట్టు మాజీ ఆటగాడు రాజ్‌కుమార్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవీంద్ర జడేజా అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే గొప్ప ఆటగాడు గొప్ప కెప్టెన్‌ అవ్వాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. కాగా మెగా టోర్నీ ప్రారంభానికి సరిగ్గా రెండ్రోజుల ముందు సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించి సీఎస్‌కే గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ధోని స్థానంలో రవీంద్ర జడేజా సారథ్య బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ విషయంపై స్పందించిన విరాట్‌ కోహ్లి చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ.. ‘‘రవీంద్ర జడేజా ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్‌. ఇందులో ఎలాంటి డౌట్‌ లేదు. అయితే, కెప్టెన్‌గా అతడికి ఎక్కువ అనుభవం లేదు. నిజం చెప్పాలంటే.. ఓ మంచి ఆటగాడు.. మంచి కెప్టెన్‌ అవుతాడని కచ్చితంగా చెప్పలేం. అంతేకాదు గొప్ప కెప్టెన్‌ ఒక్కోసారి మంచి ప్లేయర్‌ కూడా కాకపోవచ్చు. 

అయితే, అతడికి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. కాబట్టి టీమ్‌ను ఎలా మేనేజ్‌ చేసుకోవాలో కనీస అవగాహన ఉండటం సహజం. అంతేగాక ఎంఎస్‌ ధోని జట్టులో ఉండనే ఉన్నాడు. జడేజాకు అతడు మార్గనిర్దేశనం చేస్తాడు’’ అని చెప్పుకొచ్చారు. కాగా మార్చి 26న డిపెండింగ్‌ చాంపియన్‌ సీఎస్‌కే- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు తెరలేవనుంది. కెప్టెన్లుగా జడేజా- శ్రేయస్‌ అయ్యర్‌ మొదటి మ్యాచ్‌లో తలపడబోతున్నారు.

చదవండి: World Cup 2022: వర్షం పడితే.... నేరుగా సెమీస్‌లోకి భారత్‌.. లేదంటే కష్టమే?! 

Advertisement

తప్పక చదవండి

Advertisement