రోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌ చూస్తారా.. | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌ చూస్తారా..

Published Sat, Sep 12 2020 3:34 PM

Rohit Sharma Wows Fans With Stunning One Handed Catch In Practice - Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 2020 సీజన్‌ మొదలుకావడానికి ఇంకా వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. లీగ్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్‌ 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబై ఆటగాళ్ల ప్రాక్టీస్‌ వీడియోలను ఆ జట్టు యాజమాన్యం ట్విటర్‌లో షేర్‌ చేస్తూ వచ్చింది. (చదవండి : ఐపీఎల్‌లో తొలి అమెరికన్‌ క్రికెటర్‌!)

మొన్నటికి మొన్న బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా సిక్సులతో రెచ్చిపోయిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌.. తాజాగా తనలోని ఫీల్డింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ప్రాక్టీస్‌ సందర్భంగా మొదటి రెండు బంతులను సాదాసీదాగా అందుకున్న రోహిత్‌ మూడో బంతిని మాత్రం ఎడమ పక్కకు ఒరిగి ఒంటి చేత్తో డైవ్‌చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో పాటు తనలో మంచి ఫీల్డర్‌ ఉన్నాడంటూ రోహిత్‌ కామెంట్‌ చేశాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్‌ తమ ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది. 

కాగా డిపెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్‌పై మరోసారి అంచనాలు బాగానే ఉన్నాయి. లీగ్‌లో ఉన్న ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా ఉన్న ముంబైకి వ్యక్తిగత కారణాలతో స్టార్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ దూరం కావడం కొంచెం ఇబ్బందిగా మారొచ్చు.  రోహిత్‌ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌కు క్రిస్‌లిన్‌, క్వింటాన్‌ డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషాన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లతో బ్యాటింగ్‌  విభాగం బలంగానే ఉంది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌లు జట్టులో ఉండటం అదనపు బలం. బౌలింగ్‌ విభాగంలో జస్‌ప్రీత్‌ బుమ్రా, మిచెల్‌ మెక్లీన్‌గన్‌తో పాటు ట్రెంట్‌ బౌల్ట్‌, కౌల్టర్‌ నైల్‌ రూపంలో నాణ్యమైన పేసర్లు ఉన్నారు.(చదవండి : 'మోసం చేయడం కళ.. అందరికి అబ్బదు')

Advertisement
Advertisement