ఐపీఎల్‌లో రుతురాజ్‌ డెబ్యూ సెంచరీ.. రికార్డుల మోత

2 Oct, 2021 21:52 IST|Sakshi

Ruturaj Gaikwad Debue Century In IPL.. సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఐపీఎల్‌లో తొలి సెంచరీతో మెరిశాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి సెంచరీ మోత మోగించాడు. 60 బంతుల్లో 101 పరుగులు సాధించిన రుతురాజ్‌ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు.. 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రుతురాజ్‌ తాను ఆడుతున్న సీఎస్‌కే జట్టుతో పాటు వ్యక్తిగతంగా పలు రికార్డులు సాధించాడు. 

►రుతురాజ్‌ గైక్వాడ్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి సెంచరీ
►సీఎస్‌కే తరపున ఐపీఎల్‌లో తొమ్మిదో సెంచరీ చేసిన ఆటగాడిగా గైక్వాడ్‌ రికార్డు
►సీఎస్‌కే తరపున పిన్న వయసులో(24 ఏళ్ల 244 రోజులు) సెంచరీ కొట్టిన గైక్వాడ్‌
►ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఒక ఆటగాడు సెంచరీ కొట్టడం ఇది ఏడోసారి
►ఇక సీఎస్‌కే తరపున సెంచరీ కొట్టిన మూడో ఆటగాడిగా గైక్వాడ్‌. ఇంత‍కముందు 2010లో మురళి విజయ్‌, 2018లో షేన్‌ వాట్సన్‌ సెంచరీలు సాధించారు.


Courtesy: Youtube

మరిన్ని వార్తలు