సైబర్‌క్రైమ్‌ను ఆశ్రయించిన సచిన్‌ టెండూల్కర్‌ | Sakshi
Sakshi News home page

#SachinTendulkar: సైబర్‌క్రైమ్‌ను ఆశ్రయించిన సచిన్‌ టెండూల్కర్‌

Published Sat, May 13 2023 5:03 PM

Sachin-Police Complaint-Mumbai Crime Branch Over Fake-Photo-Voice - Sakshi

త‌న పేరును అక్ర‌మంగా ఉప‌యోగిస్తూ దుర్వినియోగం చేస్తోన్న ఓ మెడిక‌ల్‌ కంపెనీపై టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కేసు పెట్టాడు. స‌చిన్ అనుమ‌తి లేకుండా అత‌డి ఫొటోల‌తో పాటు వాయిస్‌ను ప్ర‌మోష‌న్స్ కోసం ఈ మెడిక‌ల్ కంపెనీ ఉప‌యోగించుకుంటున్న‌ట్లు తేలింది.

ఈ మెడిక‌ల్ కంపెనీపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స‌చిన్ టెండూల్క‌ర్ సైబ‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్లు తెలిసింది. స‌చిన్‌హెల్త్. ఇన్ పేరుతో డ్ర‌గ్‌ కంపెనీ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. స‌చిన్ ఫొటోను ఉప‌యోగిస్తూ త‌మ సంస్థ‌కు చెందిన మెడిక‌ల్‌ ప్రొడ‌క్ట్స్‌ను అమ్ముకుంటున్న‌ట్లు స‌మాచారం. స‌చిన్ వాయిస్‌ను డ‌బ్బింగ్ ద్వారా ఉప‌యోగిస్తూ ప్ర‌మోష‌న్స్ చేస్తోన్న‌ట్లు తెలిసింది.

త‌న పేరును ఉప‌యోగించుకునేలా ఈ సంస్థ‌కు స‌చిన్ ఎలాంటి అనుమ‌త‌లు ఇవ్వ‌లేద‌ని తెలిసింది. త‌న అనుమ‌తి లేకుండా పేరుతో పాటు వాయిస్‌, ఫొటోగ్రాఫ్స్ వాడుతోన్న‌ మెడిక‌ల్ కంపెనీపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ స‌చిన్ వెస్ట్ రీజియ‌న్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు చెబుతోన్నారు.

స‌చిన్ వ‌న్డేల‌కు 2012లో, టెస్ట్‌ల‌కు 2013లో రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. అయినా అత‌డికి ఉన్న క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం ఒక్కో బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ కోసం స‌చిన్ టెండూల్క‌ర్ ఏడు నుంచి ఎనిమిది కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. కోహ్లి, ధోనీ త‌ర్వాత బ్రాండ్స్ ద్వారా అత్య‌ధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న క్రికెట‌ర్‌గా స‌చిన్‌ నిలుస్తోన్నాడు.

చదవండి: భారీ ఓటమి తప్పదనుకున్నవేళ రషీద్‌ సంచలన ఇన్నింగ్స్‌

Advertisement
Advertisement