పంజాబ్‌ కీలక నిర్ణయం.. ఐపీఎల్‌ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడికి గుడ్‌బై!? | Sakshi
Sakshi News home page

IPL 2024: పంజాబ్‌ కీలక నిర్ణయం.. ఐపీఎల్‌ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడికి గుడ్‌బై!?

Published Sun, Nov 26 2023 12:13 PM

Sam Curran To Be Released By Punjab Kings Ahead Of IPL Auctions 2024 - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌ కోసం ఆయా ప్రాంఛైజీలు అంటిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించడానికి గడువు నేటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం 4లోపు ఫ్రాంచైజీలు తమ రిటేన్షన్‌ లిస్ట్‌ను అందజేయాలి.

ఈ క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌ ప్రాంఛైజీకి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు, ఇంగ్లండ్‌ యువ సంచలనం సామ్‌ కుర్రాన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ వేలంలోకి విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌-2023 మినీవేలంలో కుర్రాన్‌ను ఏకంగా రూ.18.5 కోట్ల రికార్డు ధరకు పంజాబ్‌ కొనుగోలు చేసింది. కానీ గత సీజన్‌లో తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో కుర్రాన్‌ విఫలమయ్యాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తీవ్రనిరాశపరిచాడు. 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 276 పరుగులతో పాటు 10 వికెట్లు పడగొట్టాడు.

ధావన్‌ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైతే కుర్రానే జట్టును నడిపించాడు. అయితే అతడిని విడిచిపెట్టి వేలంలో మరో యువ ఆల్‌రౌండర్‌ సొంతం చేసుకోవాలని పంజాబ్‌ భావిస్తున్నట్లు వినికిడి. కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరగనుంది.
చదవండి: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా: ఏబీ డివిలియర్స్‌

Advertisement
Advertisement