Sanath Jayasuriya Poses With 1996 WC Man Of The Series Car Photo Viral - Sakshi
Sakshi News home page

WC 1996: అప్పుడు కారు.. ఇప్పుడు మీరు! అందమైన జ్ఞాపకం.. ఈ క్రికెటర్‌ని గుర్తుపట్టారా?

Published Mon, Apr 3 2023 3:41 PM

Sanath Jayasuriya Poses With 1996 WC Man Of The Series Car Photo Viral - Sakshi

Sanath Jayasuriya- “Golden memories”: శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం సనత్‌ జయసూర్య 1996 ప్రపంచకప్‌ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. నాటి వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో తన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రతిఫలంగా లభించిన కారుతో ఉన్న ఫొటోలు పంచుకున్నాడు. 

ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఈ అపురూప చిత్రానికి.. ‘‘మరుపురాని జ్ఞాపకాలు: 27 ఏళ్ల క్రితం.. 1996 వరల్డ్‌కప్‌ మ్యాన్‌ ఆఫ్‌ సిరీస్‌ కార్‌తో ఇలా’’ అని తన పాత, ప్రస్తుత ఫొటోను జతచేసి క్యాప్షన్‌ ఇచ్చాడు. సనత్‌ జయసూర్య అభిమానులను ఆకర్షిస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అప్పుడు కారు మెరిసింది.. ఇప్పుడు మీరు మెరుస్తున్నారు అంటూ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు.

కంగారూ జట్టును చిత్తుచేసి
ప్రపంచకప్‌- 1996 ఫైనల్లో లాహోర్‌ వేదికగా శ్రీలంక- ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లంక ఆసీస్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టును చిత్తు చేసి జగజ్జేతగా అవతరించింది. 

ఇక ఈ మెగా టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి 221 పరుగులు సాధించడంతో పాటు.. ఏడు వికెట్లు తీసిన లంక ఆల్‌రౌండర్‌ సనత్‌ జయసూర్య మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతడికి ఆడి కారు బహుమతిగా లభించింది.

ఇదిలా ఉంటే..  సనత్‌ జయసూర్య తన కెరీర్‌లో 445 వన్డేల్లో 13,430, 110 టెస్టుల్లో 6973 పరుగులు, 31 టీ20 మ్యాచ్‌లలో 629 పరుగులు సాధించాడు. ఇందులో 42 సెంచరీలు, మూడు ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ తన కెరీర్‌ మొత్తంలో వన్డే, టెస్టులు, టీ20లలో వరుసగా.. 323, 98, 19 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక..
IPL 2023: ధోనికి సరైన వారసుడు.. అతడికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో!: సెహ్వాగ్‌

Advertisement
Advertisement