IPL 2023 MI Vs RR: Sanju Samson Hails Yashasvi Jaiswal - Sakshi
Sakshi News home page

IPL 2023: వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. అతడొక అద్భుతం: సంజూ శాంసన్‌

Published Mon, May 1 2023 10:59 AM

Sanju Samson Hails Yashasvi Jaiswal - Sakshi

ఐపీఎల్‌-2023లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  రాజస్తాన్‌ రాయల్స్‌ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లు దారుణంగా దారుణంగా విఫలమయ్యారు. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు చెతులేత్తేశారు.

దీంతో 6 వికెట్లు తేడాతో రాజస్తాన్‌ పరాజయం చవిచూసింది. ఆఖరి ఓవర్‌లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు బాది ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఇక ముంబై చేతిలో ఓటమిపై మ్యాచ్‌ అనంతరం రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ స్పందించాడు. తమ ఓటమికి కారణం బౌలింగ్‌ వైఫల్యమే శాంసన్‌ తెలిపాడు.

Photo Credit : IPL Website
"టైమ్ అవుట్ సమయంలో మేము సూర్యకుమార్‌ గురుంచి చర్చించుకున్నాం. అతడిని ఏ విధంగా అయినా ఔట్‌ చేయాలి అనుకున్నాం. మా ప్లాన్‌ ప్రకారం సూర్యను పెవిలియన్‌కు పంపాం. కానీ డేవిడ్‌ మాత్రం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. మ్యాచ్‌లో మంచు ప్రభావం కూడా కాస్త ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేసిన అనుభవం మాకు ఉంది. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. మా బౌలర్లు కొంచెం కష్టపడి ఉంటే బాగుండేది.

చదవండి: #Rohit sharma: చాలా సంతోషంగా ఉంది.. అతడు భయపెట్టాడు..! భారత క్రికెట్‌కు చాలా మంచిది
ఇక చివరి తొమ్మిది మ్యాచుల్లో మేం కొన్ని గెలిచాం, మరి కొన్ని మ్యాచ్‌ల్లో చివరి వరకు గట్టిగా పోరాడి ఓడాం. మనం కష్టపడితే ఫలితాలు వాటింతంట అవే వస్తాయి. మేము మా లోపాలను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాము. ఇక జైస్వాల్ నుంచి ఈ సెంచరీ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. 

Photo Credit : IPL Website
అతడు మా జట్టుకు దొరికిన విలువైన ఆస్తి" అంటూ పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో శాంసన్‌ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.  ఓవరాల్‌గా జైశ్వాల్‌ 62 బంతుల్లో 124 పరుగులు చేశాడు.
చదవండి: #Yashasvi Jaiswal: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన జైశ్వాల్‌.. తొలి క్రికెటర్‌గా!

Advertisement

తప్పక చదవండి

Advertisement