నీరజ్‌కు రెండో స్థానం | Sakshi
Sakshi News home page

నీరజ్‌కు రెండో స్థానం

Published Sat, May 11 2024 4:17 AM

Second place for Neeraj

దోహా: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా కొత్త సీజన్‌లో శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన దోహా డైమండ్‌ లీగ్‌ మీట్‌లో ప్రస్తుత ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌ అయిన నీరజ్‌ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 

10 మంది పోటీపడిన ఈ ఈవెంట్‌లో నీరజ్‌ చివరిదైన ఆరో ప్రయత్నంలో జావెలిన్‌ను 88.36 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని పొందాడు. జాకుబ్‌ వాద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌; 88.38 మీటర్లు) తొలి స్థానంలో నిలువగా... పీటర్సన్‌ (గ్రెనెడా; 86.62 మీటర్లు) మూడో స్థానాన్నికైవసం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన కిశోర్‌ జేనా 76.31 మీటర్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement