IND Vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. హార్దిక్‌ దూరం.. యువ ఆల్‌రౌండర్‌కు చోటు!

27 Sep, 2022 08:26 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో రేపటి నుంచి జరగాల్సిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనేందుకు ముందుగా ఎంపిక చేసిన భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఆడిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం విశ్రాంతి ఇవ్వగా... దీపక్‌ హుడా వెన్నెముక గాయంతో దూరమయ్యాడు.

కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో మొహమ్మద్‌ షమీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అందుబాటు ఉండటంలేదు. హార్దిక్‌ పాండ్యా స్థానంలో బెంగాల్‌ ఆల్‌రౌండర్‌ షహబాజ్‌ అహ్మద్‌ను, దీపక్‌ హుడా స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక చేశారు. 27 ఏళ్ల షహబాజ్‌ అహ్మద్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున నిలకడగా రాణించిన ఆకట్టుకున్నాడు.

షహబాజ్‌ 16 మ్యాచ్‌లు ఆడి 219 పరుగులు సాధించి నాలుగు వికెట్లు తీశాడు. బుధవారం తిరువనంతపురంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్‌ జరగనుంది. మరోవైపు అక్టోబర్‌ 1 నుంచి 5 వరకు రాజ్‌కోట్‌లో జరిగే ఇరానీ కప్‌ మ్యాచ్‌లో సౌరాష్ట్రతో పోటీపడే రెస్టాఫ్‌ ఇండియా జట్టుకు ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
చదవండి: IND vs SA: టీమిండియాకు నిరసన సెగ.. సంజూ అభిమానుల ఆందోళన

మరిన్ని వార్తలు