Sakshi News home page

World Cup 2023: 'ఇది నిజంగా చెత్త నిర్ణయం'.. బాబర్‌ అజంపై అక్తర్‌ మండిపాటు

Published Sat, Nov 4 2023 4:05 PM

Shoaib Akhtar slams Pakistan captain, team management  - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బౌలర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం.. తొలుత న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌ అహ్హనించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓ‍వర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

కివీస్‌ బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర(108) సెంచరీతో చెలరేగగా.. కేన్‌ విలియమ్సన్‌(95), గ్లెన్‌ ఫిలిప్స్‌(41) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్‌ బౌలర్లలో వసీం మూడు వికెట్లు సాధించగా.. రవూఫ్‌, ఇఫ్తికర్‌, హసన్‌ అలీ ఒక్క వికెట్‌ సాధించారు. 

బాబర్‌ ఆజంపై విమర్శలు.. 
ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదటి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బాబర్‌ ఆజంపై పాకిస్తాన్‌ మాజీ స్పీడ్‌ స్టార్‌ షోయబ్‌ అక్తర్‌ విమర్శల వర్షం కురిపించాడు. "డూ ఆర్‌ డై మ్యాచ్‌లో టాస్‌ గెలిచి పాక్ టీమ్ మేనేజ్‌మెంట్ అండ్‌ కెప్టెన్‌ ఎందుకు బౌలింగ్‌ ఎంచుకున్నారో నాకు అర్ధం కావడం లేదు.

ప్రత్యర్ధి న్యూజిలాండ్‌ జట్టులో కీలక బౌలర్లు గాయాలతో​ బాధపడుతున్న సంగతి తెలిసిందే. అటువంటిప్పుడు ఎందుకు ఈ చెత్త నిర్ణయం. అంతేకాకుండా బెంగళూరు పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. ఇటువంటి వికెట్‌పై మొదట బౌలింగ్‌ చేయాలనుకోవడం నిజంగా చెత్త నిర్ణయమని" అక్తర్‌ ట్వీట్‌ చేశాడు.
చదవండి: World Cup 2023: షాహీన్‌ అఫ్రిది అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే

Advertisement

What’s your opinion

Advertisement