శ్రేయస్‌ అయ్యర్‌ సూపర్‌ క్యాచ్‌.. బిత్తరపోయిన కాన్వే! వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

WC 2023: శ్రేయస్‌ అయ్యర్‌ సూపర్‌ క్యాచ్‌.. బిత్తరపోయిన కాన్వే! వీడియో వైరల్‌

Published Sun, Oct 22 2023 3:27 PM

Shreyas Iyers superb diving catch in World Cup match against New Zealand - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌-టీమిండియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో కివీస్‌ స్టార్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వేను అయ్యర్‌ పెవిలియన్‌కు పంపాడు.

 న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 4 ఓవర్‌ వేసిన మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో కాన్వే మిడ్‌ వికెట్‌ దిశగా షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ తన కుడివైపుకు డైవ్‌ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన కాన్వే బిత్తరపోయాడు. కాగా అయ్యర్‌ క్యాచ్‌ పట్టిన వెంటనే డగౌట్‌లో ఉన్న భారత ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ వైపు చూస్తూ మెడల్‌ తనకే అంటూ సైగలు చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మ్యాచ్‌ అనంతరం మెడల్‌తో జట్టు మేనెజ్‌మెంట్‌ సత్కరిస్తోంది. ఇప్పటికే విరాట్‌ ​కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డును అందుకున్నారు.
చదవండి: క్లాసెన్‌ కమాల్‌ ఇంగ్లండ్‌ ఢమాల్‌

Advertisement
Advertisement