Ind Vs SA T20 Series: South Africa Team Arrived In India For Limited Overs Tour - Sakshi
Sakshi News home page

IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్‌.. భారత్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు

Published Mon, Sep 26 2022 4:59 PM

South Africa Arrive in India For Limited overs Tour - Sakshi

టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత గడ్డపై అడుగు పెట్టింది. భారత పర్యటనలో భాగంగా ప్రోటీస్‌ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. బుధవారం( సెప్టెంబర్‌ 28) తిరువనంతపురం వేదికగా తొలి టీ20తో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది.

ఈ క్రమంలో ఆదివారం తిరువనంతపురంకు చేరుకున్న ప్రోటీస్‌ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సౌతాఫ్రికా క్రికెట్‌ ట్విటర్‌లో షేర్ చేసింది. ఇక తిరువనంతపురంకు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు సోమవారం తమ తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. సోమవారం తిరువనంతపురంకు చేరుకునే అవకాశం ఉంది. కాగా టీ20 ప్రపంచకప్‌-2022 సన్నాహాకాల్లో భాగంగానే ఈ సిరీస్‌ను ఇరు జట్ల క్రికెట్‌ బోర్డులు ప్లాన్‌ చేశాయి.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దక్షిణాఫ్రికా జట్టు:
టీ20 జట్టు:
తెంబా బవుమా(కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, జానేమన్‌ మలన్‌, ఎయిడెన్‌ మార్కరమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, అన్రిచ్‌ నోర్జే, వానే పార్నెల్‌, పెహ్లుక్వాయో, డ్వేన్‌ ప్రిటోరియస్‌, కగిసో రబడ, తబ్రేజ్‌ షంసీ.

వన్డే జట్టు:
తెంబా బవుమా(కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, ఎయిడెన్‌ మార్కరమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, అన్రిచ్‌ నోర్జే, వానే పార్నెల్‌, డ్వేన్‌ ప్రిటోరియస్‌, కగిసో రబడ, రీలీ రోసోవ్‌, తబ్రేజ్‌ షంసీ, జోర్న్‌ ఫార్చూన్‌, పెహ్లుక్వాయో, మార్కో జాన్‌సేన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌.


చదవండి: Ind Vs SA T20, ODI Series: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్‌! ఇతర వివరాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement