క్రీడాకారులందరికీ టీకాలు: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

26 May, 2021 08:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీని సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ పర్యవేక్షణలో టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న క్రీడాకారులు సాయిప్రణీత్, సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టిలతోపాటు అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఇతర క్రీడాకారులతో ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు క్రీడాకారులకు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని.... క్రీడాకారుల జాబితాను సిద్ధం చేసి వారికి లాల్‌బహదూర్‌ స్టేడియంలో టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలలో జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాలలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

చదవండి: BAN Vs SL: బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్‌; అలా అయితే ఇంకా సంతోషించేవాడిని!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు