Sunrisers Hyderabad SRH Predicted Playing XI vs LSG - Sakshi
Sakshi News home page

IPL 2023 SRH vs LSG: లక్నోతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ వచ్చేశాడు! 13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్‌

Published Thu, Apr 6 2023 6:30 PM

Sunrisers Hyderabad SRH Predicted Playing XI vs  - Sakshi

ఐపీఎల్‌-2023లో బోణీ కొట్టేందుకు సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌ ఉవ్విళ్లూరుతుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఏప్రిల్ 7న వాజపేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగబోయే ఈ పోరులో ఎస్‌ఆర్‌హెచ్‌ అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని భావిస్తోంది. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే.

ఇక లక్నోతో మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ఐడెన్‌ మార్‌క్రమ్‌ అందుబాటులో ఉండనున్నాడు. నెదర్లాండ్స్‌తో సిరీస్‌ కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన మార్‌క్రమ్‌.. లక్నోతో మ్యాచ్‌లో మాత్రం తమ జట్టును ముందుండి నడిపించనున్నాడు. మార్‌క్రమ్‌ జట్టుతో కలవడం సన్‌రైజర్స్‌ పటిష్టంగా కన్పిస్తోంది. అయితే మార్‌క్రమ్‌ అందుబాటులోకి రావడంతో లక్నోతో మ్యాచ్‌కు హ్యారీ బ్రూక్‌ను పక్కన పెట్టనున్నట్లు సమాచారం.

అదే విధంగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ స్థానంలో హెన్రిచ్‌ క్లాసన్‌ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌-2023 మినీ వేలంలో ఇంగ్లండ్‌ పవర్‌ హిట్టర్‌ 13.25 కోట్ల రూపాయలకు ఎస్‌ఆర్‌హెచ్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన తొలి మ్యాచ్‌లో బ్రూక్‌ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 21 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే బ్రూక్‌ను పక్కన పెట్టాలని ఎస్‌ఆర్‌హెచ్‌ మెన్‌జెమెంట్‌ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మార్‌క్రమ్‌, అభిషేక్‌ చెలరేగితే...
ఇక బ్యాటింగ్‌ పరంగా ఎస్‌ఆర్‌హెచ్‌ పటిష్టంగా కన్పిస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు అభిషేక్‌ శర్మ, త్రిపాఠి, మారక్రమ్‌, మయాంక్‌ అగర్వాల్‌ చెలరేగితే లక్నో బౌలర్లకు కష్టాలు తప్పవు. కెప్టెన్‌ మార్‌క్రమ్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నెదర్లాండ్‌పై సూపర్‌ సెంచరీ తర్వాత మార్‌క్రమ్‌కు ఇదే తొలి మ్యాచ్‌ కావడం గమనార్హం. మార్‌క్రమ్‌ తన ఆల్‌రౌండ్‌ స్కిల్స్‌తో లక్నోకు చుక్కలు చూపించగలడని ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్లు తమ మార్క్‌ను చూపించడంలో విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్‌లో ఒక నటరాజన్‌ మినహా మిగితా అందరూ నిరాశపరిచారు. కానీ జట్టులో ఉమ్రాన్‌ మాలిక్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఫజల్హక్ ఫారూఖీ వంటి స్పీడ్‌ స్టార్లు ఉన్నారు. వీరు తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేస్తే.. లక్నో బ్యాటర్లకు చుక్కలు కన్పించడం ఖాయం. సన్‌రైజర్స్‌ బౌలర్లు అద్భుతంగా రాణిస్తారో లేదా తొలి మ్యాచ్‌లా తెలిపోతారో వేచి చూడాలి.

ఎస్‌ఆర్‌హెచ్‌ తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్, ఫజల్హక్ ఫారూఖీ

ఇంపాక్ట్ ప్లేయర్స్(అంచనా)
అబ్దుల్ సమద్, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ మార్కండే, వివ్రంత్ శర్మ

 

చదవండి: IPL 2023: శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో యువ సంచలనం.. ఎవరంటే?

Advertisement
Advertisement