WI VS SA: రసెల్‌ స్టన్నింగ్‌ త్రో.. దాదాపు 100 కిమీ వేగంతో | Sakshi
Sakshi News home page

WI VS SA: రసెల్‌ స్టన్నింగ్‌ త్రో.. దాదాపు 100 కిమీ వేగంతో

Published Tue, Oct 26 2021 6:26 PM

T20 World Cup 2021: Bullet Throw From Russell Bavuma Gets Run Out - Sakshi

Andre Russel Bullet Throw.. టి20 ప్రపంచకప్‌ 2021లో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఆండీ రసెల్‌ సూపర్‌ త్రోతో మెరిశాడు. దాదాపు 100 కిమీ వేగంతో విసిరిన డైరెక్ట్‌ త్రోకు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఇది చోటుచేసుకోవడం విశేషం.

చదవండి: T20 WC 2021: ఫోకస్‌గా లేవు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పక్కనపెడుతున్నా

తొలి ఓవర్‌ను ఎకిల్‌ హొస్సేన్‌ వేయగా.. చివరి బంతిని బవుమా మిడాన్‌ దిశగా ప్లిక్‌ చేశాడు. ఫీల్డర్‌ దూరంగా ఉండడంతో ఈజీ సింగిల్‌ అనుకున్నారు.. కానీ రసెల్‌ ఇక్కడే మ్యాజిక్‌ చేశాడు. వేగంగా ముందుకు పరిగెత్తుకు వచ్చిన రసెల్‌ బంతిని అందుకొని వేగంగా త్రో విసిరాడు. దీంతో బంతి డైరెక్టుగా వికెట్లను గిరాటేయడం.. బవుమా రనౌట్‌ కావడం చకచకా జరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.

చదవండి: T20 WC 2021 SA Vs WI: విండీస్‌ బ్యాటర్‌ చెత్త రికార్డు.. 35 బంతుల్లో..!

Advertisement
Advertisement