T20 WC 2021 IND Vs AFG: అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా స్టార్‌ పేసర్‌.. | Sakshi
Sakshi News home page

T20 WC 2021 IND Vs AFG: అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా స్టార్‌ పేసర్‌..

Published Wed, Nov 3 2021 2:50 PM

T20 World Cup 2021 IND Vs AFG: Bumrah On The Cusp Of Big Record - Sakshi

Bumrah Three Wickets Away From Becoming Highest Wicket Taker For Team India In T20s: టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అరుదైన రికార్డుపై కన్నేసాడు. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు మరో మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా ఇవాళ(నవంబర్‌ 3) అఫ్గానిస్థాన్‌తో జరిగే పోరులో బుమ్రా ఈ అరుదైన ఫీట్‌ను సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

ప్రస్తుతం బుమ్రా 52 టీ20ల్లో 61 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. యుజ్వేంద్ర చహల్‌ 49 టీ20ల్లో 63 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత రవిచంద్రన్‌ అశ్విన్‌(52), భువనేశ్వర్‌ కుమార్‌(50), హార్ధిక్‌ పాండ్యా(42)లు వరుసగా ఉన్నారు. 

ఇక ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 94 మ్యాచ్‌ల్లో 117 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత లసిత్‌ మలింగ్‌(84 మ్యాచ్‌ల్లో 107), రషీద్‌ ఖాన్‌(54 మ్యాచ్‌ల్లో 102), టిమ్‌ సౌథీ(85 మ్యాచ్‌ల్లో 101) వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో బుమ్రా 21వ స్థానంలో నిలిచాడు.  
చదవండి: వారిని క్షమించు.. జట్టును కాపాడుకో.. కోహ్లికి బాసటగా నిలిచిన రాహుల్‌ గాంధీ

Advertisement
Advertisement