T20 World Cup 2022: Mohammed Shami Clean Dinesh Karthik In Practice Session, Video Viral - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: కార్తీక్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన షమీ.. వీడియో వైరల్‌

Published Mon, Oct 17 2022 10:44 AM

T20 World Cup 2022: Mohammed Shami Cleans Dinesh Karthik in practice session - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022కు స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా దూరం కావడంతో.. అతడి స్థానంలో వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ జట్టులోకి వచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ తర్వాత షమీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియా గడ్డపై ఏ విధంగా రాణిస్తాడన్నది అందరి మెదడులను తొలుస్తున్న ప్రశ్న.

అయితే ఆస్ట్రేలియాకు చేరుకున్న షమీ నెట్స్‌లో మాత్రం చెమటోడ్చుతున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేష్ కార్తీక్‌ను షమీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. షమీ బౌలింగ్‌లో కార్తీక్‌  షాట్‌కు ప్రయత్నించాడు. కానీ షాట్‌ ఆడటంలో విఫలమైన కార్తీక్‌.. క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టీ20 ప్రపంచకప్‌ సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో తొలి వార్మప్‌ మ్యాచ్‌లో తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ప్లేయింగ్‌ ఎలవెన్‌లో షమీకి చోటు దక్క లేదు.


చదవండి: KL Rahul: అర్థశతకంతో చెలరేగిన కేఎల్‌ రాహుల్‌

Advertisement
Advertisement