రోహిత్‌ నిద్రలేని రాత్రులు గడిపాడు.. ముంబై బ్యాటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

MI VS RR: రోహిత్‌ నిద్రలేని రాత్రులు గడిపాడు.. ముంబై బ్యాటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Mon, May 1 2023 5:35 PM

Tim David Comments After MI VS RR Match - Sakshi

వాంఖడే వేదికగా నిన్న (ఏప్రిల్‌ 30) జరిగిన ఐపీఎల్‌ థౌంజండ్‌వాలాలో (ఐపీఎల్‌ 100వ మ్యాచ్‌) రాజస్థాన్‌ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్‌ చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ లక్ష్యఛేదనలో (213) ముంబై బ్యాటర్లు మూకుమ్మడిగా చెలరేగి, తమ కెప్టెన్‌కు (ఏప్రిల్‌ 30న రోహిత్‌ బర్త్‌ డే) అద్భుత విజయాన్ని బహుమతిగా ఇచ్చారు. తొలుత గ్రీన్‌ (26 బంతుల్ల 44), సూర్యకుమార్‌ యాదవ్‌ (29 బంతుల్లో 55) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడగా.. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ (14 బంతుల్లో 45 నాటౌట్‌) హ్యాట్రిక్ సిక్సర్లు బాది తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. టిమ్‌ డేవిడ్‌ విధ్వంసం దెబ్బకు ముంబై మరో 3 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

మ్యాచ్‌ అనంతరం టిమ్‌ మాట్లాడుతూ.. చారిత్రక మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం సాధించి, తమ కెప్టెన్‌కు గిఫ్ట్‌ ఇచ్చామని అన్నాడు. ఇదే సందర్భంగా టిమ్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో తాము (ముంబై ఇండియన్స్‌ సభ్యులు) ఆశించిన మేరకు రాణించకపోవడంతో తమ కెప్టెన్‌ నిద్రలేని రాత్రులు గడిపాడని, అంతిమంగా అతని బర్త్‌ డే రోజు గెలుపును కానుకగా ఇవ్వగలిగామని అన్నాడు.

చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అతడు భయపెట్టాడు..! భారత క్రికెట్‌కు చాలా మంచిది

ఆర్‌ఆర్‌తో మ్యాచ్‌లో తిలక్‌ వర్మ రిధమ్‌లో లేనట్లు కనిపించాడని, అతను షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించడంతో ముంబైని ఎలాగైనా తానే గట్టెక్కించాలని భావించానని తెలిపాడు. మ్యాచ్‌ను ఇలా ముగించాలనే కసితో షాట్లు ఆడానని, హ్యాట్రిక్‌ సిక్సర్లతో మ్యాచ్‌ను ఫినిష్‌ చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని అన్నాడు. జట్టులో సభ్యులంతా తమ వంతు ప్రదర్శనలతో చెలరేగారు. నా ఛాన్స్‌ కోసం వెయిట్‌ చేసి నేను కూడా సక్సెస్‌ అయ్యానని తెలిపాడు.

చారిత్రక మ్యాచ్‌లో (1000వ మ్యాచ్‌) తమ జట్టును ఇలా గెలిపించడం పట్ల చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, టిమ్‌ ఊచకోత ధాటికి రాజస్థాన్‌ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ (62 బంతుల్లో 124; 16 ఫోర్లు 8 సిక్సర్లు) సుడిగాలి శతకం మరుగున పడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. జైస్వాల్‌ రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. జైస్వాల్‌ మినహా రాజస్థాన్‌ టీమ్‌లో కనీం ఒక్కరు కూడా 20 పరుగులు చేయలేకపోయారు.   

చదవండి: MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్‌ సూపర్‌స్టార్‌.. నో డౌట్‌!

Advertisement

తప్పక చదవండి

Advertisement