IPL 2023, SRH Vs RCB: Virat Kohli Equals Chris Gayle For Most Centuries In The History Of IPL - Sakshi
Sakshi News home page

Virat Kohli: గేల్‌ రికార్డు సమం.. చరిత్రకెక్కడానికి ఇంకొక్కటి!

Published Thu, May 18 2023 11:38 PM

Virat Kohli 6th-Ton-Equals Chris Gayle Centuries Record Most 100s-IPL - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. కోహ్లి సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఆర్‌సీబీ సునాయాస విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే గాక మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆర్‌సీబీ తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్లేఆఫ్‌లో అడుగుపెడుతుంది.

ఇక మ్యాచ్‌లో శతకం సాధించిన కోహ్లి ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. గేల్‌ ఐపీఎల్‌లో ఆరు శతకాలు సాధించాడు. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఐపీఎల్‌లో ఆరో సెంచరీ సాధించి గేల్‌ రికార్డును సమం చేశాడు. కోహ్లి, గేల్‌ తర్వాత జాస్‌ బట్లర్‌ ఐదు శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి మరొక సెంచరీ సాధిస్తే ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కనున్నాడు.

ఇక ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో రెండు శతకాలు నమోదు కావడం ఇది మూడోసారి. ఇంతకముందు 2016లో గుజరాత్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాటర్లు కోహ్లి, డివిలియర్స్‌లు శతకాలు బాదారు. 2019లో డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో జంట ఆర్‌సీబీపై సెంచరీలతో చెలరేగగా.. తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గురువారం ఎస్‌ఆర్‌హెచ్‌,ఆర్‌సీబీ మ్యాచ్‌లో.. మొదట క్లాసెన్‌ ఆర్‌సీబీపై .. అటుపై కోహ్లి ఎస్‌ఆర్‌హెచ్‌పై సెంచరీతో చెలరేగాడు.

చదవండి: ఉప్పల్‌లో మ్యాచ్‌ అంటే చెలరేగుతాడు.. కోహ్లి అరుదైన రికార్డు


 

Advertisement
Advertisement