వాళ్లంతా అంబానీ అంటీలియాలో! కోహ్లి మాత్రం శివసేన లీడర్‌ ఇంట్లో! మనసు పారేసుకున్న సమంత..

20 Sep, 2023 18:25 IST|Sakshi

Virat Kohli- Anushka Sharma- Gansesh Chatirthi 2023: ఆసియా కప్‌-2023 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సహా పలువురికి విశ్రాంతి దొరికింది. వన్డే వరల్డ్‌కప్‌-2023కి ముందు ఆస్ట్రేలియాతో మూడో వన్డేతో వీరంతా మళ్లీ బరిలోకి దిగనున్నారు. 

ఈ నేపథ్యంలో దొరికిన విరామ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి. వినాయక చవితి సందర్భంగా భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి పండుగ జరుపుకొన్నాడు. ముంబైలోని తమ నివాసంలో విరుష్క దంపతులు ఎకో ఫ్రెండ్లీ గణనాథునికి పూజలు చేశారు.

వాళ్లంతా అంటీలియాలో
హార్దిక్‌ పాండ్యా, సచిన్‌ టెండుల్కర్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ తదితరులు.. భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ ఇంట(అంటీలియా) వినాయకుడి పూజలో పాల్గొనగా.. కోహ్లి మాత్రం తమ ఇంట్లో సెలబ్రేషన్స్‌ చేసుకున్నట్లు సమాచారం. ఇక విఘ్నేశ్వరుడి పూజలో కోహ్లి, అనుష్క సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.

గోధుమ రంగు ఎరుపు రంగులు మేళవించిన చీర ధరించి అనుష్క నిండుగా కనిపించగా.. కోహ్లి తెలుపు రంగు కుర్తా ధరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క శర్మ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇక ఇందుకు స్పందించిన సినీ సెలబ్రిటీలు సమంత రుతుప్రభు, కరిష్మా కపూర్‌ తదితరులు హార్ట్‌ ఎమోజీలతో ప్రేమను తెలియజేశారు.

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

కోహ్లి మాత్రం ఆ లీడర్‌ ఇంట్లో
ఇదిలా ఉంటే.. విరాట్‌ కోహ్లి.. శివసేన నాయకుడు రాహుల్‌ కనాల్‌ ఇంట్లో గణేశ్‌ దర్శనానికి వెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులకు అభివాదం చేస్తూ కోహ్లి కారెక్కుతుండగా అభిమానులు అతడిని చూసేందుకు పోటీపడ్డారు. ఈ వీడియోను వైరల్‌ భయానీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

వన్డే వరల్డ్‌కప్‌కి ముందు
కాగా ఆసియా వన్డే కప్‌-2023లో కోహ్లి పాకిస్తాన్‌ మీద అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 122 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ స్టార్‌ బ్యాటర్‌.. అంతర్జాతీయ కెరీర్‌లో 77వ సెంచరీ నమెదు చేశాడు. ఇక సెప్టెంబరు 27న ఆసీస్‌తో ఆఖరి వన్డేల్లో మళ్లీ కోహ్లి మెరుపులు చూసే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌ ఈవెంట్లో అతడు పాల్గొంటాడు.

చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్‌ కావాల్సినోడు.. 

మరిన్ని వార్తలు