ప్రేక్షకులు లేకున్నా... ఆట నాణ్యత మారదు  | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు లేకున్నా... ఆట నాణ్యత మారదు 

Published Tue, Aug 25 2020 2:47 AM

VVS Laxman Speaks About IPL 2020 Tournament - Sakshi

దుబాయ్‌: ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ జరిగినంత మాత్రాన క్రికెట్‌ నాణ్యత తగ్గిపోదని భారత దిగ్గజ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) బ్యాటింగ్‌ మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ‘నేను అభిమానులందరికీ హామీ ఇస్తున్నా. మైదానంలో ప్రేక్షకులు లేనప్పటికీ క్రికెట్‌ నాణ్యతలో ఎలాంటి మార్పూ ఉండబోదు. ముందులాగే ఈ ఐపీఎల్‌ కూడా మీ అందర్నీ అలరిస్తుందనే నమ్మకముంది’ అని లక్ష్మణ్‌ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. కరోనా కారణంగా యూఏఈకి తరలిపోయిన ఐపీఎల్‌ దుబాయ్, షార్జా, అబుదాబి వేదికల్లో సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో అక్కడి పిచ్‌ల స్వభావంపై లక్ష్మణ్‌ కాస్త ఆందోళన వ్యక్తం చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌కు కొత్తగా నియమితులైన హెడ్‌ కోచ్‌ ట్రెవర్‌ బేలిస్, అసిస్టెంట్‌ కోచ్‌ బ్రాడ్‌ హాడిన్‌ల ఆధ్వర్యంలో జట్టు మరింత ఉన్నతి సాధిస్తుందని లక్ష్మణ్‌ అన్నాడు.

Advertisement
Advertisement