WC 2023: మార్కరమ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ.. వరల్డ్‌కప్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా | Sakshi
Sakshi News home page

#Aiden Markram: మార్కరమ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా! వరల్డ్‌కప్‌ హిస్టరీలో తొలిసారి

Published Sat, Oct 7 2023 6:00 PM

WC 2023 4th Match SA Vs SL: Aiden Markram Hits Fastest Century ODI World Cup - Sakshi

ICC Cricket World Cup 2023- South Africa vs Sri Lanka, 4th Match: వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు దుమ్ములేపుతున్నారు. లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. శతకాల మోత మోగిస్తూ అభిమానులకు కావాల్సినంత మజా అందిస్తున్నారు.

మెరుపు సెంచరీతో
ఢిల్లీలో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ 100, వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాసీ వాన్‌ 108 పరుగులు సాధించగా.. నాలుగోస్థానంలో బరిలోకి దిగిన ఎయిడెన్‌ మార్కరమ్‌ మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించాడు.

ప్రపంచ రికార్డు బద్దలు
ప్రపంచకప్‌ టోర్నీలో అత్యంత వేగంగా 100 పరుగుల మార్కు అందుకున్న బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. 49 బంతుల్లోనే సుడిగాలి శతకంతో పరుగుల సునామీ కొనసాగిస్తున్నాడు. కాగా సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా 45.5 ఓవర్‌ వద్ద మధుషంక బౌలింగ్‌లో సిక్స్‌ బాది మార్కరమ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా కెవిన్‌ ఒబ్రెయిన్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి.. ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు.

వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీలు(బంతుల పరంగా)
►2023: ఎయిడెన్‌ మార్కరమ్‌- 49.. ఢిల్లీలో శ్రీలంక మీద
►2011: కెవిన్‌ ఒబ్రెయిన్‌- 50... బెంగళూరులో ఇంగ్లండ్‌ మీద
►2015: గ్లెన్‌ మాక్స్‌వెల్‌-51.. సిడ్నీలో శ్రీలంక మీద
►2015: ఏబీ డివిలియర్స్‌- 52... సిడ్నీలో వెస్టిండీస్‌ మీద. 

Advertisement
Advertisement