'Not a schoolgirl mistake': Harmanpreet hits back at Nasser Hussain - Sakshi
Sakshi News home page

Ind Vs Aus: అంత సిల్లీగా అవుటవుతారా? అవునా అలా అన్నాడా? ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌కు హర్మన్‌ కౌంటర్‌..

Published Fri, Feb 24 2023 5:08 PM

WC 2023: Not A Schoolgirl Mistake Harmanpreet Hits Back At Nasir Hussain - Sakshi

ICC Womens T20 World Cup 2023- Harmanpreet Kaur: ‘‘అవునా...? ఆయన అలా అన్నాడా? పర్లేదు. నాకైతే ఆ విషయం తెలియదు. అయితే, అది ఆయన ఆలోచనా విధానానికి నిదర్శనం. అయినా కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పరుగులు తీసే క్రమంలో సింగిల్‌ పూర్తి చేసిన తర్వాత మరో పరుగుకు యత్నించినపుడు బ్యాట్‌ అలా అక్కడ స్టక్‌ అయిపోయింది. 

నిజంగా అదో దురదృష్టకర పరిణామం. మేము ఈ మ్యాచ్‌లో మరీ అంత చెత్తగా ఫీల్డింగ్‌ చేయలేదు. కొన్నిసార్లు బాగా బౌలింగ్‌ చేయకపోవచ్చు.. మరికొన్ని సార్లు సరిగ్గా బ్యాటింగ్‌ చేయకపోవచ్చు. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తేనే మ్యాచ్‌ గెలవగలం. 

ఈరోజు మా ప్రదర్శన బాగానే ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఇలా జరిగిపోయింది. ఇక రనౌట్‌ విషయానికొస్తే.. ఆయనన్నట్లు అదేమీ స్కూల్‌ గర్ల్‌ మిస్టేక్‌ కాదు. మేము పరిణతి కలిగిన ఆటగాళ్లమే. నేను గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నా. 

ఆయన అలా ఆలోచిస్తే నేనేమీ చేయలేను. అయితే, కచ్చితంగా అది స్కూల్‌ గర్ల్‌ మిస్టేక్‌ కాదని మాత్రం చెప్పగలను’’ అంటూ భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఇంగ్లండ్‌ మాజీ సారథి, కామెంటేటర్‌ నాసిర్‌ హుస్సేన్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది.

సెమీస్‌ భారత్‌ ఓటమి
కాగా సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 మహిళా ప్రపంచకప్‌-2023 టోర్నీ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడ్డ సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ ఆరంభంలోనే తడబడ్డా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జెమీమా రోడ్రిగ్స్‌, ఐదో స్థానంలో వచ్చిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గెలుపు ఆశలు చిగురింపజేశారు.

అనూహ్య రీతిలో రనౌట్‌
జెమీమా 24 బంతుల్లో 43 పరుగులతో రాణించగా.. హర్మన్‌ 34 బంతుల్లో 52 పరుగులతో మెరిసింది. అయితే, 14.4 వోర్‌ వద్ద ఆసీస్‌ బౌలర్‌ వారెహాం బౌలింగ్‌లో హర్మన్‌ దురదృష్టకర రీతిలో రనౌట్‌ అయింది. సింగిల్‌ పూర్తి చేసిన మరో పరుగు తీసే క్రమంలో.. డైవ్‌ చేసి బంతిని ఆపిన గార్డ్‌నర్‌వికెట్‌ కీపర్‌ వైపు బాల్‌ విసిరింది.

ఆ సమయంలో హర్మన్‌ సులువుగానే క్రీజులోకి చేరుకుంటుందన్నట్లు కనిపించినా బ్యాట్‌ స్టక్‌ అయిపోవడంతో.. అప్పటికే బంతిని అందుకున్న హేలీ బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో హర్మన్‌ రనౌట్‌గా వెనుదిరిగింది. ఇదే మ్యాచ్‌ను ఆసీస్‌ వైపు తిప్పింది. ఆఖరి వరకు పోరాడిన టీమిండియా 5 పరుగుల తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది.

అతడికి కౌంటర్‌
ఇదిలా ఉంటే.. హర్మన్‌ రనౌట్‌పై కామెంటేటర్‌ నాసిర్‌ హుస్సేన్‌ స్పందిస్తూ.. కాస్తైనా పరిణతి లేకుండా చిన్న పిల్ల మాదిరి ఏంటిది అన్న అర్థంలో స్కూల్‌ గర్ల్‌ ఎర్రర్‌ అంటూ లైవ్‌లో వ్యాఖ్యానించాడు. ఇంత సిల్లీగా అవుటవుతారా అని కామెంట్‌ చేశాడు. ఈ విషయం గురించి మ్యాచ్‌ తర్వాత హర్మన్‌కు ప్రశ్న ఎదురుకాగా.. ఆమె పైవిధంగా స్పందిస్తూ అతడికి కౌంటర్‌ ఇచ్చింది.

చదవండి: Ind Vs Aus: భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్‌ ఎలా ఉందంటే!
Tim Southee: టిమ్‌ సౌథీ అరుదైన ఘనత.. సరికొత్త రికార్డు.. 700 వికెట్లతో..

Advertisement

తప్పక చదవండి

Advertisement