Shardul Thakur: ప్రపంచకప్‌ జట్టులో అతడికి చోటు ఖాయం! అంతలేదు.. హార్దిక్‌ ఉండగా..

26 Jan, 2023 13:18 IST|Sakshi
శార్దూల్‌ ఠాకూర్‌ (PC: BCCI)

India vs New Zealand- Shardul Thakur: ‘‘శార్దూల్‌.. అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. లోపాలు సవరించుకుంటూ పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతూనే ఉంటాడు. తను బంతిని పెద్దగా స్వింగ్‌ చేయలేడని మనం భావించినప్పుడల్లా మనల్ని ఆశ్చర్యపరుస్తూ వికెట్లు తీస్తూనే ఉంటాడు. 

తను ప్రతిసారి గంటకు 140కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్‌ చేయకపోవచ్చు. కానీ.. అతడు నంబర్‌ 1గా ఎదుగుతాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. భారత పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

రాణించిన శార్దూల్‌
ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో శార్దూల్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. హైదరాబాద్‌లో జరిగిన  మొదటి వన్డేలో 7.2 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చిన రెండు వికెట్లు తీసిన అతడు.. 3 పరుగులు చేయగలిగాడు. రాయ్‌పూర్‌ వన్డేలో 6 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇక ఆఖరిదైన ఇండోర్‌ మ్యాచ్‌లో 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 25 పరుగులతో సత్తా చాటిన శార్దూల్‌.. 6 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చోటు ఖాయం
ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ మ్యాచ్‌ పాయింట్‌ సందర్భంగా.. వన్డే ప్రపంచకప్‌ జట్టు గురించి ప్రస్తావనకు రాగా ఇర్ఫాన్‌ పఠాన్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కివీస్‌తో ఫైనల్‌ వన్డేలో శార్దూల్‌ ప్రదర్శనపై స్పందిస్తూ.. వరల్డ్‌కప్‌ జట్టులో ఫాస్ట్‌బౌలర్ల విభాగంలో అతడికి కచ్చితంగా చోటు దక్కుతుందని అంచనా వేశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయగల శార్దూల్‌ మిగతా వాళ్లకంటే ఓ అడుగు ముందే ఉంటాడని చెప్పుకొచ్చాడు.

అంతలేదన్న మంజ్రేకర్‌
అయితే, మరో మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మాత్రం ఇర్ఫాన్‌ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ప్రపంచకప్‌ జట్టులో శార్దూల్‌కు స్థానం దక్కుతుందని తాను భావించడం లేదన్నాడు. ‘‘మెగా టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. జట్టులో హార్దిక్‌ పాండ్యా ఉన్నాడు. తనూ పేస్‌ ఆల్‌రౌండరే. కాబట్టి శార్దూల్‌కు చోటు కష్టమే. పేసర్ల విభాగంలోనూ అతడు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. 

చదవండి: ICC T20 World Cup: ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై
IPL: ఆల్‌టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్‌! కానీ..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు