టాస్‌ గెలిచిన విండీస్‌.. ప్రయోగాలు వదలని టీమిండియా | Sakshi
Sakshi News home page

WI Vs IND 3rd ODI: టాస్‌ గెలిచిన విండీస్‌.. ప్రయోగాలు వదలని టీమిండియా, సిరీస్‌ గెలిచేనా?

Published Tue, Aug 1 2023 6:48 PM

WI Vs IND 3rd ODI-West Indies Won Toss Opt-To Bowl - Sakshi

టీమిండియా, వెస్టిండీస్‌ల మధ్య ట్రినిడాడ్‌ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. రెండో వన్డేలో ఓటమి పాలైన టీమిండియా ప్రయోగాలను కొనసాగించింది. రెండో వన్డేకు దూరంగా ఉ‍న్న రోహిత్‌, కోహ్లిలకు జట్టు మేనేజ్‌మెంట్‌ ఈ మ్యాచ్‌కు కూడా విశ్రాంతినిచ్చింది.

రోహిత్‌ గైర్హాజరీలో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో కీలకమైన మూడో వన్డేలో బరిలోకి దిగనుంది. అయితే టీమిండియా ఈ మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఉమ్రాన్‌ మాలిక్‌ స్థానంలో జైదేవ్‌ ఉనాద్కట్‌.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ తుది జట్టులోకి వచ్చారు. ఇక విండీస్‌ మాత్రం సేమ్‌ జట్టుతోనే బరిలోకి దిగింది.

తొలి రెండు వన్డేల్లో చెరొకటి గెలిచి 1-1తో సమంగా ఉన్న విండీస్‌, టీమిండియాల్లో మూడో వన్డే ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెండో వన్డేలో ఓడినా ప్రయోగాలు ఆపని టీమిండియా మూడో వన్డేలో నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకుంటుందా అన్నది చూడాలి.

భారత్(ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్

చదవండి: హెచ్‌సీఏ నిర్వాకం.. జట్టులో అవకాశమిస్తామంటూ లక్ష వసూలు

నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు!

Advertisement

తప్పక చదవండి

Advertisement