World Cup 2022 Super 12: England vs Afghanistan Updates Highlights - Sakshi
Sakshi News home page

T20 WC 2022 ENG vs AFG: బోణీ కొట్టిన ఇంగ్లండ్‌.. ఆఫ్గానిస్తాన్‌పై విజయం

Published Sat, Oct 22 2022 4:12 PM

World Cup 2022 Super 12: England vs Afghanistan Updates Highlights - Sakshi

బోణీ కొట్టిన ఇంగ్లండ్‌.. ఆఫ్గానిస్తాన్‌పై విజయం
టీ20 ప్రపంచకప్‌-2022లో ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. సూపర్‌-12లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్‌ ‍ బ్యాటర్లలో లివింగ్‌ స్టోన్‌(29), హేల్స్‌(19) పరుగులతో రాణించారు.

ఆఫ్గాన్‌ బౌలర్లలో ఫరూఖీ,నబీ, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌, మాలిక్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆఫ్గానిస్తాన్‌ 112 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ పేసర్‌ సామ్ కర్రాన్ ఐదు వికెట్లతో ఆఫ్గానిస్తాన్‌ పతనాన్ని శాసించగా.. స్టోక్స్‌ వుడ్‌ తలా  రెండు వికెట్లు, వోక్స్‌ ఒక్క వికెట్‌ సాధించాడు. ఆఫ్గాన్‌ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ 32 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

నాలుగో వికెట్‌ డౌన్‌
ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన మలాన్‌.. నబీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 95/4

మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
స్టోక్స్‌ రూపంలో ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది.  2 పరుగులు చేసిన స్టోక్స్‌.. నబీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 76/3

రెండో వికెట్‌ డౌన్‌.. హేల్స్‌ ఔట్‌
52 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన హేల్స్‌.. ఫరీద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. బట్లర్‌ ఔట్‌
113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 35 పరుగులు వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన బట్లర్‌.. ఫరూఖీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి డేవిడ్‌ మలాన్‌ వచ్చాడు.

2 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 14/0
113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్‌(9), హెల్స్‌(2) పరుగులో ఉన్నారు.

ఐదు వికెట్లతో చెలరేగిన సామ్ కర్రాన్.. 112 పరుగులకే ఆఫ్గాన్‌ ఆలౌట్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్గానిస్తాన్‌ 112 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ పేసర్‌ సామ్ కర్రాన్ ఐదు వికెట్లతో ఆఫ్గానిస్తాన్‌ పతనాన్ని శాసించగా.. స్టోక్స్‌ వుడ్‌ తలా  రెండు వికెట్లు, వోక్స్‌ ఒక్క వికెట్‌ సాధించాడు. ఆఫ్గాన్‌ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ 32 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

16 ఓవర్లకు ఆఫ్గాన్‌ స్కోర్‌: 97/5
ఆఫ్గానిస్తాన్‌ వరుసక్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది.  14 ఓవర్‌ వేసిన స్టోక్స్‌ బౌలింగ్‌లో నజీబుల్లా జద్రాన్ ఔట్‌ కాగా.. 15 ఓవర్‌ వేసిన వుడ్‌ బౌలింగ్‌లో నబీ పెవిలియన్‌కు చేరాడు.

13 ఓవర్లకు ఆఫ్గానిస్తాన్‌ స్కోర్‌: 78/3
13 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్‌ మూడు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఘని(16), నజీబుల్లా జద్రాన్(12) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఆఫ్గానిస్తాన్‌
35 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జజాయ్‌.. బెన్‌ స్టోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 7 ఓవర్లకు ఆఫ్గాన్‌ స్కోర్‌: 37/2

6 ఓవర్లకు ఆఫ్గాన్‌ స్కోర్‌: 35/1
6 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్‌ ఒక వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజులో ఇబ్రహీం జద్రాన్(16), జజాయ్‌(7) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆఫ్గానిస్తాన్‌
11 పరుగులు వద్ద ఆఫ్గానిస్తాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్బాజ్.. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లకు ఆఫ్గానిస్తాన్‌ స్కోర్‌: 15/1

టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆఫ్గానిస్తాన్‌ తలపడుతోంది. పెర్త్‌ వేదికగా జరుగతోన్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఆఫ్ఘనిస్తాన్: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, ఉస్మాన్ ఘని, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరూఖీ, ఫరీద్ అహ్మద్ మలిక్

ఇంగ్లండ్: జోస్ బట్లర్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

చదవండి: T20 WC 2022: ఫిలిప్స్‌ అద్భుత విన్యాసం.. గాల్లోకి ఎగిరి డైవ్‌ చేస్తూ..!

Advertisement

తప్పక చదవండి

Advertisement