WPL 2023: Kohli Faf Announces Smriti Mandhana Named As RCB Captain - Sakshi
Sakshi News home page

Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌ ఆమే.. ప్రకటించిన కోహ్లి, ఫాఫ్‌ డుప్లెసిస్‌.. వీడియో వైరల్‌

Published Sat, Feb 18 2023 11:33 AM

WPL 2023: Kohli Faf Announces Smriti Mandhana Named As RCB Captain - Sakshi

WPL 2023- RCB- Smriti Mandhana: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్‌గా భారత స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన ఎంపికైంది. బీసీసీఐ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళా ప్రీమియర్‌ లీగ్‌ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈ మేరకు టీమిండియా వైస్‌ కెప్టెన్‌కు అవకాశం ఇచ్చింది. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది. 

ప్రకటన చేసిన కోహ్లి, ఫాఫ్‌
ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌తో స్మృతి మంధాన కెప్టెన్‌గా నియమితురాలైన విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. స్మృతికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ వీరిద్దరు ఇచ్చిన సందేశానికి సంబంధించిన వీడియోను ఫ్రాంఛైజీ ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

తాము ఊహించిందే నిజమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నంబర్‌ 18 తమకు ప్రత్యేకమంటూ కోహ్లితో ముడిపెట్టి మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా టీమిండియా స్టార్‌ ఓపెనర్‌గా మంధానకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

థాంక్యూ...
ఇక ఈ విషయంపై స్పందించిన టీమిండియా ఓపెనర్‌ స్మృతి మంధాన.. ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్‌గా ఎంపికకావడం అద్భుతమైన ఫీలింగ్‌ అని హర్షం వ్యక్తం చేసింది. విరాట్‌, ఫాఫ్‌ సారథ్యంలో జట్టు ఇప్పటికే తామేంటో నిరూపించుకుందన్న స్మృతి.. తాను కూడా ఆర్సీబీని విజయవంతంగా ముందు నడిపిస్తానని పేర్కొంది. మేనేజ్‌మెంట్‌ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. ఇందుకు అభిమానుల మద్దతు కూడా కావాలని కోరింది.

అత్యధిక ధరకు
డబ్ల్యూపీఎల్‌ వేలం-2023లో స్మృతి కోసం 3.4 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఆర్సీబీ. ఈ క్రమంలో తొలి వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా స్మృతి మంధాన పేరు రికార్డులకెక్కింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఇటీవలే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను తమ మెంటార్‌గా నియమించుకున్న సంగతి తెలిసిందే. కాగా మార్చి 4 నుంచి వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభం కానుంది.

చదవండి: Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్‌.. కానీ పాపం..
IND vs AUS: రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఓపెనర్‌ దూరం!

Advertisement

తప్పక చదవండి

Advertisement