Sakshi News home page

WTC Final: సెంచరీ పూర్తి చేసుకున్న స్టీవ్‌ స్మిత్‌, ఒక్క సెంచరీతో ఎన్ని రికార్డులో..!

Published Thu, Jun 8 2023 3:32 PM

WTC Final: Steve Smith Completes 31st Test Hundred - Sakshi

ఓవల్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ప్రారంభం కాగానే  స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ పూర్తి చేశాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాది స్మిత్‌ కెరీర్‌లో 31వ శతకాన్ని సాధించాడు. ఈ సెంచరీతో స్మిత్‌ పలు రికార్డులను నెలకొల్పాడు. 

  • ఇంగ్లండ్‌ గడ్డపై స్మిత్‌కు ఇది 7వ సెంచరీ
  • ఆస్ట్రేలియా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానం. రికీ పాంటింగ్‌ (41), స్టీవ్‌ వా (32) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
  • టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్‌తో పాటు అగ్రస్థానం​. రూట్‌, స్మిత్‌లు ఇద్దరు టీమిండియాపై 9 శతకాలు బాదారు.
  • పర్యాటక జట్టు తరఫున ఇంగ్లండ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్‌ వాతో పాటు రెండో స్థానం. స్టీవ్‌ వా, స్మిత్‌లు ఇద్దరు చెరో 7 సెంచరీలు చేయగా.. టాప్‌లో సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ (11) ఉన్నారు.
  • పర్యాటక జట్టు తరఫున ఇంగ్లండ్‌లోని ఓ వేదికపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానం. స్టీవ్‌ స్మిత్‌ ఓవల్‌ మైదానంలో 3 సెంచరీలు చేశాడు. డాన్‌ బ్రాడ్‌మన్‌ హెడింగ్లేలో అత్యధికంగా 4 సెంచరీలు, ట్రెంట్‌బ్రిడ్జ్‌లో 3 సెంచరీలు చేశాడు. భారత్‌ తరఫున దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ లార్డ్స్‌లో 3 సెంచరీలు చేశాడు.
  • భారత్‌-ఆస్ట్రేలియా మధ్యలో టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానం (9). ఈ జాబితాలో సచిన్‌ (11) టాప్‌లో ఉన్నాడు.
  • ఐసీసీ నాకౌట్‌  మ్యాచ్‌ల్లో కనీసం 2 సెంచరీలు చేసిన ఏడో ఆటగాడు. గంగూలీ (3), పాంటింగ్‌ (3), సయీద్‌ అన్వర్‌ (3), జయవర్దనే (2), రోహిత్‌ శర్మ (2), వాట్సన్‌ (2) స్టీవ్‌ స్మిత్‌ కంటే ముందున్నారు. 

కాగా, 91 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 361/3గా ఉంది. ట్రవిస్‌ హెడ్‌ (163), స్టీవ్‌ స్మిత్‌ (110) క్రీజ్‌లో ఉన్నారు.

చదవండి: WTC Final: ట్రవిస్‌ హెడ్‌.. ద గేమ్‌ ఛేంజర్‌, ఎదురుదాడే లక్ష్యం

Advertisement

తప్పక చదవండి

Advertisement