Ashes 2023: Zak Crawley record-setting 189 runs in single day of 4th Test - Sakshi
Sakshi News home page

జాక్‌ క్రాలీ సంచలనం.. రోజు వ్యవధిలో ఎక్కువ పరుగులు చేసిన మూడో ఇంగ్లండ్‌ బ్యాటర్‌

Published Fri, Jul 21 2023 8:58 AM

Zak Crawley 189 Runs-3rd ENG Batter Most Runs In Single Day Ashes Test - Sakshi

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైనప్పటికి బజ్‌బాల్‌ దూకుడు మాత్రం వదల్లేమని తేల్చి చెప్పింది. మూడో టెస్టులో విజయం అందుకున్న ఇంగ్లండ్‌ ఎలాగైనా సిరీస్‌ కోల్పోకూడదనే పట్టుదలతో ఉంది. అందుకే మాంచెస్టర్‌ వేదికగా మొదలైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ మరోసారి బజ్‌బాల్‌ ఆటతీరును చూపించింది. ఒక్కరోజులోనే దాదాపు 400 పరుగులు మార్క్‌ అందుకునేలా కనిపించిన ఇంగ్లండ్‌ చివరకు రెండో రోజు ఆటను 4 వికెట్ల నష్టానికి 384 పరుగుల వద్ద ముగించింది. ఒకవేళ ఆసీస్‌ తొలి సెషన్‌ ఆరంభంలోనే ఔటయ్యి ఉంటే ఇంగ్లండ్‌ 400 పరుగులు మార్క్‌ను కూడా క్రాస్‌ చేసేదే.

ఇక ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలీ ఇ‍న్నింగ్స్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వన్డే తరహాలో వేగంగా ఆడిన క్రాలీ తృటిలో డబుల్‌ సెంచరీ చేజార్చుకున్నప్పటికి 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. 93 బంతుల్లోనే శతకం మార్క్‌ సాధించిన క్రాలీ ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అతనికి రూట్‌(95 బంతుల్లో 84 పరుగులు) జత కలవడంతో ఇంగ్లండ్‌ స్కోరు ఓవర్‌కు ఐదు పరుగుల రనరేట్‌కు తగ్గకుండా పరిగెత్తడం విశేషం.  ఇక ఆస్ట్రేలియా బౌలర్లు కేవలం మూడు మెయిడెన్‌ ఓవర్లు మాత్రమే ఇచ్చుకున్నారంటే ఇంగ్లండ్‌ ఎంత ధాటిగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు.

► ఈ క్రమంలో జాక్‌ క్రాలీ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు.యాషెస్‌ చరిత్రలో ఒక్క రోజు వ్యవధిలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా జాక్‌ క్రాలీ నిలిచాడు. క్రాలీ ఈ మ్యాచ్‌లో 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. క్రాలీ కంటే ముందు టిప్‌ ఫోస్టర్‌(1902లో సిడ్నీ వేదికగా 214 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వాలీ హామండ్‌(1938లో లార్డ్స్‌ వేదికగా 210 పరుగులు) ఉన్నాడు.ఇక బాబ్‌ బార్బర్‌(1966లో సిడ్నీ వేదికగా 185 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నాడు.

► ఇక యాషెస్‌ టెస్టులో ఒక్క సెషన్‌లోనే సెంచరీ అందుకున్న ఆరో ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా క్రాలీ రికార్డులకెక్కాడు.

► క్రాలీ స్ట్రైక్‌రేట్‌ 103 కాగా యాషెస్‌ చరిత్రలో ఇది రెండో బెస్ట్‌గా ఉంది. 103 స్ట్రైక్‌రేట్‌తో ఒక ఇన్నింగ్స్‌లో 150కి పైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌తో కలిసి క్రాలీ సంయుక్తంగా ఉన్నాడు.

► 93 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ అందుకున్న క్రాలీ యాషెస్‌ టెస్టులో వేగవంతంగా సెంచరీ సాధించిన నాలుగో ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా నిలిచాడు.

చదవండి: 500వ మ్యాచ్‌లో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి

Advertisement

తప్పక చదవండి

Advertisement