జిల్లాలో.. | Sakshi
Sakshi News home page

జిల్లాలో..

Published Wed, Mar 22 2023 2:12 AM

- - Sakshi

పల్లెలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్రజారోగ్యాన్ని సంరక్షించే లక్ష్యంతో

పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గ్రామాల్లో ఇళ్లలో వెలువడిన చెత్తను క్లాప్‌ మిత్రలు ఇంటింటికీ వెళ్లి సేకరించి సంపద కేంద్రాలకు తరలిస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణను ప్రణాళికా బద్ధంగా చేపడుతున్నారు. ఆ చెత్త నుంచి వర్మీ కంపోస్టును తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు. తద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరుతోంది. ఈ కేంద్రాలకు అవసరమైన

వనరులు, వాహనాలు, పరికరాలను ప్రభుత్వం ఆయా పంచాయతీలకు అందజేసి గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

పంచాయతీలు 722

ఇప్పటివరకు తయారైన వర్మీకంపోస్టు – సుమారు 400 టన్నులు

పూర్తిస్థాయిలో నిర్మించిన సంపద కేంద్రాలు 488

నెల్లూరు(పొగతోట): రాష్ట్రంలోని పంచాయతీల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గ్రామాల పరిశుభ్రత, ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు పంచాయతీలకు ఆదాయం సమకూరుతోంది. జిల్లాల విభజన అనంతరం 722 పంచాయతీలు జిల్లాలో ఉండగా ఇప్పటివరకు 488 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్మించింది.

ప్రణాళికాబద్ధంగా నిర్వహణ

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో నిర్మించేలా చర్యలు చేపట్టింది. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించాలనే లక్ష్యంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి దానిని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. చెత్త సేకరణ కోసం జిల్లావ్యాప్తంగా 1800 మంది క్లాప్‌ మిత్రలను ప్రభుత్వం నియమించింది. వారు గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తలను సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. చెత్త నుంచి ఘన వ్యర్థాల నిర్వహణను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా 38 చెత్త తరలింపు వాహనాలు, 818 ట్రై సైకిళ్లు, 659 ఫాగింగ్‌ మెషీన్లు, 722 ఇన్స్‌నిరేటర్లు, 559 హైప్రెజర్‌ టాయిలెట్‌ క్లీనర్స్‌ను అందించింది. అంతేకాకుండా సంపద కేంద్రాల వద్దకు అవసరమైన రోడ్లు, నీరు వనరులు, విద్యుత్‌ సదుపాయం, మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది.

క్లాప్‌ మిత్రలకు వేతనాలు

పంచాయతీల్లో సంపద కేంద్రాల ద్వారా సమకూరిన ఆదాయంతో క్లాప్‌ మిత్రలకు వేతనాలు చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టారు. క్లాప్‌ మిత్రలు కేంద్రాల్లో కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచి వాటిని విక్రయిస్తున్నారు. వీటి ద్వారా కూడా పంచాయతీకి ప్రతి సంవత్సరం రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల ఆదాయం వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు.

చెత్త సేకరణకు నియమించిన క్లాప్‌ మిత్రలు 1800 మంది

విక్రయించింది

60 టన్నులు

సమకూరిన ఆదాయం –

రూ.20 లక్షలకుపైనే..

నెల్లూరు రూరల్‌లోని కాకుపల్లిలో ఏర్పాటైన సందప తయారీ కేంద్రం

వర్మీకంపోస్టుతో ఆదాయం

సంపద కేంద్రాల్లో తడి, పొడి చెత్తల ద్వారా నాణ్యమైన వర్మీకంపోస్టును తయారు చేసి కేజీ రూ.10 చొప్పున రైతులకు విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని కేంద్రాల్లో సుమారు 400 టన్నులకు పైగా వర్మీకంపోస్టును తయారు చేయగా, 60 టన్నులకుపైగా విక్రయించారు. అలాగే చెత్తలోని ప్లాస్టిక్‌ సామగ్రిని విక్రయించడం, కేంద్రాల్లో పండించిన ఆకుకూరలు, కూరగాయ లు, పండ్లను విక్రయిస్తున్నారు. మొత్తమ్మీద ఈ విక్రయాల ద్వారా రూ.20 లక్షలకుపైగా ఆదా యం సమకూరింది. అంతేకాకుండా గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి శుక్రవారం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్లకిరువైపులా చెత్త లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. డీఎల్‌పీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాల నిర్వహణకు, ఫిర్యాదుల స్వీకరణకు మండల, జిల్లా స్థాయిల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రజలు పారిశుధ్ధ్యంపై ఫిర్యాదులు చేయవచ్చు.

పరిశుభ్రంగా గ్రామాలు

జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను తరలించి వేరు చేసి వర్మీకంపోస్టు తయారు చేస్తున్నాం. వర్మీకంపోస్టును విక్రయించడం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరుతోంది. ఇప్పటివరకు రూ.20 లక్షల ఆదాయం వచ్చింది.

– బి.చిరంజీవి, డీపీఓ

పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం

పరిశుభ్రతతోపాటు ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

తడి, పొడి చెత్తలుగా వే రు చేసి

వర్మీకంపోస్టు తయారీ

సంపద కేంద్రాలతో సమకూరిన ఆదాయ వనరులు

తద్వారా వచ్చిన ఆదాయంతో

క్లాప్‌ మిత్రలకు వేతనాలు

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement