Sakshi News home page

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలి

Published Fri, Nov 10 2023 5:04 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌  హరినారాయణన్‌  - Sakshi

కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌

నెల్లూరు (దర్గామిట్ట): సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌ హరినారాయణన్‌ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల ద్వారా క్షేత్రస్థాయిలో చేపడుతున్న కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు వాటికి సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతిపై ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తున్నందున ప్రాధాన్యత ఇండికేటర్స్‌ లక్ష్య సాధనపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణులకు ప్రతి నెలా వైద్యపరీక్షలు నిర్వహించాలని సూచించారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఐరన్‌ మాత్రలు, అదనపు పౌష్టికాహారం అందజేయాలన్నారు. ఎత్తు తక్కువ, బరువు తక్కువ ఉన్న ఐదేళ్లలోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహరం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. డీఈఓ గంగా భవాని, ఐసీడీఎస్‌ పీడీ హేనాసుజన, సీపీఓ రాజు, సమగ్ర శిక్ష ఏపీసీ ఉషారాణి, ఇన్‌చార్జి డీఈఓ ఖాదర్‌వళి, డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌నాఽథ్‌, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement