రైతుల ప్రయోజనాలకు పెద్దపీట | Sakshi
Sakshi News home page

రైతుల ప్రయోజనాలకు పెద్దపీట

Published Wed, Nov 15 2023 12:28 AM

- - Sakshi

బహిష్కృత ఎమ్మెల్యేల హైడ్రామా

కండలేరుకు

5 టీఎంసీల పరిశీలన

కండలేరు జలాశయంలో ప్రస్తుతం 11.3 టీఎంసీల నీరు ఉన్న నేపథ్యంలో డెడ్‌ స్టోరేజ్‌ 8.4 టీఎంసీలు పోగా 3.4 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటాయి. ఇందులో తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు, రాపూరు, పొదలకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణ తాగునీటి అవసరాలకు పోను కండలేరు పరిధిలో గల చెరువులు, పాడి పశువుల నీటి అవసరాలకు 3 టీఎంసీలు, తాగునీటి పథకాలకు 0.4 టీఎంసీలు, పరిశ్రమలకు 1.2 టీఎంసీలు ఇవ్వాల్సిన నేపథ్యంలో కండలేరుకు దాదాపు 8 టీఎంసీల నీటిని సోమశిల నుంచి సరఫరా చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో తెలుగుగంగ ఎస్‌ఈ హరినారాయణరెడ్డి ప్రతిపాదించారు. సోమశిల జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వలో పెన్నార్‌ డెల్టాకు సాగునీరు, జిల్లా ప్రజల తాగునీరు, ఇతర అవసరాలను పరిశీలించి కండలేరు జలాశయానికి కనీసం 5 టీఎంసీలైనా విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కాకాణి తెలిపారు.

పెన్నార్‌ డెల్టాకు సాగునీరు

2.20 లక్షల ఎకరాలకు

సోమశిల జలాలు

20 నుంచి సాగునీరు విడుదల చేసేలా ఐఏబీ సమావేశంలో నిర్ణయం

నీటి లభ్యతను బట్టి ఉత్తర, దక్షిణ, కావలి, కనువూరు కాలువలకు కూడా

బెడిసికొట్టిన బహిష్కృత ఎమ్మెల్యేల హైడ్రామా

ఎమ్మెల్యే ఆనం ప్రసంగంపై

రైతుల అసహనం

టీడీపీ నాయకులు ఆందోళనలు చేస్తారనే ముందస్తు సమాచారంతో పోలీసు అధికారులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు నిర్వహించారు. టీడీపీ నాయకులు దొడ్డిదారిన వచ్చి జెడ్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. ఐఏబీ సమావేశంలో వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జిల్లా రైతులపై లేని ప్రేమను ఒలకబోస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల 20 టీఎంసీల నీరు వృథాగా పోయిందని, పంట కాలువల పూడికతీత పనుల్లో ఉపాధి నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఇతర అంశాలను లేవనెత్తి అధికారులు ఇచ్చిన సమాధానాలపై అసహనం వ్యక్తం చేస్తూ సరైన సమాధానాలు ఇవ్వలేదంటూ వాకౌట్‌ చేశారు. ఆనంకు వత్తాసు పలుకుతూ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఇద్దరు రైతు సంఘ నాయకులు ఆయనను అనుసరించారు. వాస్తవానికి ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, ఎండతీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో నీటిఆవిరి శాతం గతంలో కన్నా రెట్టింపు అయింది. దీని వల్ల సాగునీటి వినియోగం అధికంగా ఉంది. రెండో పంట విషయానికొస్తే జలాశయం పరిధిలో పెన్నార్‌ డెల్టా, నాన్‌ డెల్టా పరిధిలో 3.11 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసుకున్నారు. వాటికి 37.5 టీఎంసీల నీటిని వినియోగించారు. ఈ ఏడాది వరి ఽపంట పుష్కలంగా పండింది. కానీ రైతులు ఆనందంగా ఉంటే సహించలేని టీడీపీ నేతలు పంటలకు సాగునీరు అందక నష్టపోయారని ఆరోపిస్తూ ప్రభుత్వంపై బురదజల్లేలా మాట్లాడారు. పంట కాలువల పనులు ఉపాధి నిధులతో చేసి ఇరిగేషన్‌ శాఖలో ఆ పనులకు బిల్లులు పెట్టుకున్నారని ఆరోపణలు చేశారు. వాస్తవంగా ఉపాధి నిధులతో పనులు చేస్తే పనిచేసిన వ్యక్తి వ్యక్తిగత ఖాతాలోనే నగదు జమ అవుతుంది. ఇరిగేషన్‌శాఖ బిల్లులు చేసుకున్న దాఖలాలు లేవు. అలాగే నెల్లూరు, సంగం బ్యారేజీలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పూర్తి చేసి స్వయంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టులపై కూడా పసలేని ఆరోపణలు చేసి సభలో చులకన అయ్యారు.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమశిల జలాశయంలో ప్రస్తుతం ఉన్న 29.8 టీఎంసీల నీటిని పెన్నార్‌ డెల్టాలో మొదటి పంటకు అందించేలా జిల్లా సాగునీటి సలహా మండలి నిర్ణయం తీసుకుంది. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సారథ్యంలో, కలెక్టర్‌ హరినారాయణన్‌ అధ్యక్షతన ఐఏబీ సమావేశం జరిగింది. 2023–24 రబీ సీజన్‌లో డెల్టా ప్రాంతంలో సాగయ్యే 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా తీర్మానించారు. ఈ నెల 20వ తేదీ నుంచి సాగునీరు విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే రాబోయే రెండు నెలల వ్యవధిలో జలాశయానికి వచ్చే వరద జలాల నీటి లభ్యతను బట్టి ఉత్తర, దక్షిణ, కావలి, కనుపూరు కాలువల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో 51 శాతం వర్షపాతం మాత్రమే నమోదు కావడంతో మొదటి పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇచ్చే పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉండడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతల సలహాలు, సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో వ్యవసాయ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు సమన్వయం చేస్తూ మంచినీటి అవసరాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సాగునీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గొడవలు సృష్టించాలనే..

అనంతరం మంత్రి కాకాణి మాట్లాడుతూ గొడవలు సృష్టించాలని వచ్చిన వారు అసహనానికి లోనై రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి సమావేశాన్ని వాకౌట్‌ చేసి వెళ్లిపోవడం ఎంత వరకు సబబో రైతులు, ప్రజలు ఆలోచించాలన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ పునాది వేసిన ప్రాజెక్ట్‌లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేశారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ బీఫామ్‌పై వైఎస్‌ జగన్‌ చరిష్మాతో గెలిచి నాలుగేళ్లు ప్రభుత్వంలో ఉండి ఇన్ని రోజులు గుర్తుకు రాని రైతుల ప్రయోజనాలు పార్టీ మారిన తర్వాత గుర్తుకొచ్చాయా అని ఆనంను ఉద్దేశించి విమర్శించారు. సమావేశంలో జేసీ కూర్మనాథ్‌, ఆఫ్కాఫ్‌ చైర్మన్‌ అనిల్‌బాబు, ఇరిగేషన్‌ ఎస్‌ఈలు కృష్ణమోహన్‌, హరినారాయణరెడ్డి, వెంకటరమణారెడ్డి, ఆర్డీఓలు మలోలా, శీనానాయక్‌, మధులత, ఇతర ప్రజాప్రతినిధులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు.

1/1

Advertisement
Advertisement