దశాబ్దాల కల సాకారం | Sakshi
Sakshi News home page

దశాబ్దాల కల సాకారం

Published Thu, Nov 16 2023 12:04 AM

రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (ఫైల్‌) 
 - Sakshi

సఫలీకృతం

డీకేటీ పట్టాలను పంపిణీ చేస్తే కేంద్ర ప్రభుత్వమిచ్చే రూ.ఆరు వేలు సైతం వస్తుందని.. తద్వారా శాశ్వత భూహక్కు కల్పించినట్లు అవుతుందని తెలుసుకొని ఈ విషయాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. సమస్యపై రాష్ట్రస్థాయి అధికారులతో పలుమార్లు మాట్లాడి మూడు గ్రామాల రైతులు 329 మందికి 326 ఎకరాల డీకేటీ పట్టాలను పంపిణీ చేశారు. మొలకలపూడిలో ఎక్కడైతే సభను సోమిరెడ్డి నిర్వహించి ఆ భూములకు పట్టాలివ్వలేమని చెప్పారో, అక్కడే కార్యక్రమాన్ని నిర్వహించి పట్టాలను మంత్రి అందజేశారు. కాగా ఈ విషయమై సాక్షితో మంత్రి కాకాణి మాట్లాడారు. ఏళ్ల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ డీకేటీ పట్టాలను పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. రెండుసార్లు తనను గెలిపించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడాన్ని తన బాధ్యతగా భావిస్తానని చెప్పారు.

వెంకటాచలం మండలంలోని మూడు గ్రామాల రైతుల ఏళ్ల కల సాకారమైంది. సీజేఎఫ్‌ఎస్‌ భూములు కావడంతో హక్కుల్లేక ఇప్పటి వరకు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో వీరి సమస్యను పరిష్కరించాలనే దృఢ నిశ్చయంతో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆయన చొరవతో వీరికి డీకేటీ పట్టాలు మంజూరయ్యాయి. వీటిని అందుకున్న లబ్ధిదారులు ఎంతో సంబరపడి మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

సీజేఎఫ్‌ఎస్‌ భూములకు డీకేటీ పట్టాలు

పట్టించుకోని గత పాలకులు

మంత్రి కాకాణి చొరవతో

329 మంది రైతులకు లబ్ధి

Advertisement
Advertisement