నమకం.. చమకం పఠణం పుణ్యప్రదం | Sakshi
Sakshi News home page

నమకం.. చమకం పఠణం పుణ్యప్రదం

Published Fri, Nov 17 2023 12:34 AM

ప్రవచనాన్ని వినిపిస్తున్న బ్రహ్మశ్రీ 
మాడుగుల నాగఫణిశర్మ  - Sakshi

శ్రీశైలంటెంపుల్‌: నమకం చమకాన్ని భక్తితో విన్నా, పఠించినా ఎంతో పుణ్యప్రదమని, ఇహపరసౌఖ్యాలు తప్పక లభిస్తాయని బృహత్‌ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ అన్నారు. కార్తీకమాసోత్సవాల సందర్భంగా శ్రీశైల దేవస్థానం పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి నాగఫణిశర్మ చే ‘నమక చమక వైభవం’ అనే ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలం, కాశీ క్షేత్రాలు వేదంలోని నమకం–చమకంలాంటివి అన్నారు. రుద్రం అంటే నమక చమకాల కలయిక అన్నారు. ఈ రుద్రమంత్రాలతో శివలింగంపై సంతతధారగా జలాన్ని పోయడాన్ని రుద్రాభిషేకం అంటారన్నారు. చమకం అంటే ఈ విశ్వమంతా రుద్రుడు ఉన్నాడనే తత్త్వాన్ని తెలియజేస్తుందన్నారు. శ్రీశైలక్షేత్రంలో కేవలం ఒక్కరోజు నివసించినంత మాత్రాన ఇహంలో అష్టైశ్వర్యాలు, పరంలో మోక్షం లభిస్తుందన్నారు.

Advertisement
Advertisement