అసోసియేట్‌ డీన్‌గా గోపీకృష్ణ | Sakshi
Sakshi News home page

అసోసియేట్‌ డీన్‌గా గోపీకృష్ణ

Published Fri, Nov 17 2023 12:34 AM

గోపీకృష్ణకు అభినందనలు తెలుపుతున్న సిబ్బంది  - Sakshi

ఉదయగిరి : పట్టణంలోని మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాలలో అసోసియేట్‌ డీన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ జి.కరుణాసాగర్‌ స్థానంలో కళాశాల వ్యవసాయ విస్తరణ విభాగం అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్‌ టి.గోపికృష్ణకు కళాశాల అసోసియేట్‌ డీన్‌గా అదనపు బాధ్యతలు కల్పించి నియమించారు. ఈ మేరకు ఆయన గురువారం కళాశాలలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ వ్యవసాయ కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. కరుణాసాగర్‌ పదోన్నతిపై విశ్వవిద్యాలయ స్థాయిలో డీన్‌గా నియమితులయ్యారు.

Advertisement
Advertisement