అయ్యప్పస్వామికి మండలపూజ | Sakshi
Sakshi News home page

అయ్యప్పస్వామికి మండలపూజ

Published Sun, Nov 19 2023 12:10 AM

- - Sakshi

నర్రవాడ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం హుండీలను శనివారం దేవస్థానం ఆవరణలో దేవదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో లెక్కించారు. జూలై 26వ తేదీ నుంచి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.20,74,130 ఆదాయం లభించినట్లు ఈఓ ఉషశ్రీ తెలిపారు. – దుత్తలూరు

కాకుటూరు వద్దనున్న వీఎస్‌యూలో శనివారం ఆంధ్రా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్సలర్‌ జీఎం సుందరవల్లి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. – వెంకటాచలం

వేదాయపాళెంం అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం శబరిమలవాసుడికి అభిషేక, హోమ పూజలు, మహాదీపారాధన నిర్వహించారు. కేరళ సంప్రదాయరీతిలో జరిగిన పూజ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామిఅయ్యప్పను దర్శించుకున్నారు. – నెల్లూరు(బృందావనం)

1/2

2/2

Advertisement
Advertisement