వంద ఆలయాలు నిర్మించాలనే సంకల్పం | Sakshi
Sakshi News home page

వంద ఆలయాలు నిర్మించాలనే సంకల్పం

Published Sun, Nov 19 2023 12:10 AM

విఘ్నేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 
 - Sakshi

పొదలకూరు : భగవంతుని ఆశీర్వాదం తోడుగా ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ భగవంతుడిని చేరువ చేయాలనే లక్ష్యంతో వంద దేవాలయాలను నిర్మించాలనే సంకల్పంతో ఉన్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వరదాపురం గిరిజన కాలనీలో నూతనంగా నిర్మించిన విఘ్నేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయానికి విచ్చేసిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.10 లక్షల టీటీడీ శ్రీవాణి నిధులతో సమరసతా సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రజలు కోరుకున్న ఆలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వరదాపురంలో వినాయకస్వామి ఆలయాన్ని నిర్మించామని, ఇందుకు టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, నూతన చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి సహకారం అందజేశారని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో దేవాలయం లేని ఊరు ఉండకూడదనే లక్ష్యంతో ఎక్కడ ఆలయం నిర్మించాలని ముందుకొచ్చినా ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు.

‘గడప గడప’లో సమస్యలకు పరిష్కారం

‘గడప గడపకు మన ప్రభుత్వం’లో గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి కాకాణి తెలిపారు. వరదాపురం గిరిజనకాలనీ వాసులు సిమెంటురోడ్డు నిర్మించాలని కోరగా, నుడా నుంచి రూ.35 లక్షలు మంజూరు చేయించి శరవేగంగా పనులు పూర్తి చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రామాల్లో డ్రైనేజీలు, సిమెంటురోడ్లు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఒక్క తాటిపర్తి పంచాయతీలోనే రూ.15 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులను సమాంతరంగా చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నగేష్‌కుమారి, డిప్యూటీ తహసీల్దార్‌ సాయిగణేష్‌బాబు, సొసైటీ చైర్మన్‌ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ పెదమల్లు రమణారెడ్డి, ఉపసర్పంచ్‌ పామూరు లచ్చారెడ్డి, మాజీ సర్పంచ్‌ పలుకూరు పోలిరెడ్డి, నాయకులు మురళీకృష్ణారెడ్డి, ఆకుల గంగిరెడ్డి, డీ శ్రీనివాసులురెడ్డి, అచ్చాల సుధాకర్‌రెడ్డి, శ్రీహరి, పీ శ్రీనివాసులురెడ్డి, సమరసత సేవా ఫౌండేషన్‌ రాష్ట్ర బాధ్యుడు విష్ణు, మండల బాధ్యుడు లక్కాకుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

సర్వేపల్లిలో ఇప్పటి వరకు 60 ఆలయాల నిర్మాణం

రాష్ట్ర వ్యవసాయశాఖ

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement