9న జాతీయ లోక్‌ అదాలత్‌ | Sakshi
Sakshi News home page

9న జాతీయ లోక్‌ అదాలత్‌

Published Sun, Nov 19 2023 12:10 AM

భూమిపూజ చేస్తున్న అధికారులు - Sakshi

నెల్లూరు(లీగల్‌): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 9వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ సి.యామిని తెలిపారు. నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న కోర్టు హాల్‌లో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నెల్లూరుతోపాటు కోవూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, కోట, ఉదయగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట కోర్టుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిష్కరించదగిన కేసుల్లోని కక్షిదారులు జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి వాణి పాల్గొన్నారు.

జాతీయ రహదారి

నిర్మాణానికి భూమిపూజ

ఉదయగిరి: సీతారామపురం–దుత్తలూరు మార్గంలో రూ.364 కోట్లతో 36 కిలోమీటర్ల మేర 167బీజీ జాతీయ రహదారి నిర్మాణానికి శనివారం ఉదయగిరి మండలం కుర్రపల్లి సమీపంలో ఎంఆర్‌జీ కనస్ట్రక్షన్స్‌ ఎండీ ము త్యాల గోవిందరెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాసులురెడ్డి, చంద్రమోహన్‌రెడ్డిలతో కలిసి హైవే డీఈ, ఏఈలు అనిల్‌కుమార్‌రెడ్డి, సుమన్‌ భూమిపూ జ నిర్వహించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సీతారామపురం, దుత్తలూ రు, ఉదయగిరి మండలాల్లో రోడ్డు నిర్మాణానికి అవసరమైన 75 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, భూహక్కుదారులైన రైతు లకు ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసిందని తెలిపారు. ఏడాది లోపు రహదారి నిర్మాణ ప నులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ గానుగపెంట ఓబుల్‌రెడ్డి, జేసీఎస్‌ కన్వీనర్‌ కల్లూరి కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు డి.గురవారెడ్డి, ఎంపీటీసీ మాజీ స భ్యుడు పి.రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ బిల్లుల బకాయిల పేరుతో మోసాలు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): విద్యుత్‌ బిల్లులు చెల్లించాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు వినియోగదారులకు ఫోన్‌ చేసి వారి నుంచి ఆన్‌లైన్‌ పద్ధతిలో నగదు దోపిడీ చేస్తున్నారని, వినియోగదారులు ఈ ముఠాల చేతుల్లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండేలా చైతన్యపరచాలని ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ విజయన్‌ జిల్లా విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని విద్యుత్‌ భవన్‌లో శనివారం జిల్లా విద్యుత్‌శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్‌ వినియోగదారులకు ఫోన్‌ చేసి ‘మీరు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదు.. వెంటనే చెల్లించకపోతే కరెంట్‌ కట్‌ చేస్తాం.. సందేహాలు ఉంటే విద్యుత్‌ అధికారికి ఫోన్‌ చేయాలంటూ ఆన్‌లైన్‌ లింక్‌ పంపి బ్యాంకు ఖాతాలోని నగదు దోచేస్తున్నారని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement